Positive Pay System: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఇక నుంచి నిబంధనలు మారనున్నాయి.. తప్పక తెలుసుకోండి.!

|

Aug 26, 2021 | 11:24 AM

Positive Pay System: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తోంది. ఆన్‌లైన్‌ మోసాలు, ఇతర బ్యాంకింగ్‌కు సంబంధించిన మోసాలను..

Positive Pay System: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఇక నుంచి నిబంధనలు మారనున్నాయి.. తప్పక తెలుసుకోండి.!
Positive Pay System
Follow us on

Positive Pay System: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తోంది. ఆన్‌లైన్‌ మోసాలు, ఇతర బ్యాంకింగ్‌కు సంబంధించిన మోసాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది ఆర్బీఐ. ఇక మీరు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్‌ అయితే శుభవార్త. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతిపాదించిన పాజిటివ్ పే విధానాన్ని పాటించేందుకు యాక్సిస్ బ్యాంకు ముందుకొచ్చింది. చెక్ బుక్ మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ పాజిటివ్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానం సెప్టెంబర్ 1, 2021 నుంచి అమలు చేయాలని యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించింది. దీని గురించి అనేక మంది యూజర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తోంది.

పాజిటివ్ పే అంటే ఏమిటి?

బ్యాంకింగ్ రంగంలోని చెక్ మోసాలను అరికట్టేందుకు జనవరి 1, 2021 నుంచి పాజిటివ్ పే వ్యవస్థను అమలు చేయాల్సిందిగా బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. వాస్తవానికి ఆర్బీఐ 2020లో చెక్ కోసం ‘పాజిటివ్ పే సిస్టమ్’ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. భారీ మొత్తంలో చెల్లింపులకు కీలక వివరాల కోసం రీ-కన్ఫర్మేషన్ అవసరం అయ్యేలా ఈ సిస్టమ్ రూపొందించింది. అయితే ఈ సిస్టమ్ రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం చెక్కులకు వర్తిస్తుంది.

రూ.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఖాతాదారుడికి సమాచారం..

కాగా, రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరగాలంటే బ్యాంకులు తప్పనిసరి ఖాతాదారుడికి సమాచారం అందిస్తాయి. పాజిటివ్ పే సిస్టమ్ పట్ల కస్టమర్లకు తగిన అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఇప్పటికే సూచించింది. ఎస్ఎంఎస్ హెచ్చరికల ద్వారా, బ్రాంచ్‌లు, ఏటీఎంలతో పాటు వెబ్‌సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పాజిటివ్ పే సిస్టమ్‌ గురించి కస్టమర్లకు తెలియజేయాల్సిందిగా ఆదేశించింది.

గుర్తించుకోవాల్సిన విషయాలు..

ఈ విధానం గురిచి వినియోగదారులు పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం. జనవరి 01, 2021 నుంచి అమలులోకి వచ్చిన పాజిటివ్ పే సిస్టమ్ ప్రకారం భారీ చెక్కుల కీలక వివరాలను తిరిగి నిర్ధారించే ప్రక్రియ ఉంటుంది. ఈ విధానంలో చెక్కు జారీచేసేవారు ఎలక్ట్రానిక్ రూపంలో, ఎస్‌ఎంఎస్‌, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం మొదలైన వాటి ద్వారా ఆ చెక్కు నిర్దిష్ట కనీస వివరాలు చెప్పాల్సి ఉంటుంది. తేదీ, లబ్ధిదారుడి పేరు, చెల్లింపుదారుడి పేరు, డబ్బు మొత్తం మొదలైనవి బ్యాంకులకు తెలియజేయాలి. అప్పుడు CTS ద్వారా చెక్కుతో వివరాలను క్రాస్ చెక్ చేస్తారు.

అన్ని వివరాలు సరిగ్గా ఉంటే బ్యాంకు అధికారులు చెక్కు క్లియర్ చేస్తారు. ఒకవేళ మీరు ఇచ్చిన వివరాలు సరిపోలకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. సీటీఎస్‌ ద్వారా ఏదైనా అవకతవకలు గుర్తిస్తే బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సీటీఎస్‌లో పాజిటివ్ పే సదుపాయాన్ని అభివృద్ధి చేసి.. సంబంధిత బ్యాంకులకు అందుబాటులోకి తీసుకురానుంది. సూచనలకు లోబడి ఉన్న చెక్కులను మాత్రమే సీటీఎస్‌ మెషిన్ అంగీకరిస్తుంది.

ఇవీ కూడా చదవండి: Health Insurance: మహిళలకు ఆరోగ్య బీమా పాలసీ.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!

Reserve Bank Of India: మరో సహకార బ్యాంకుకు భారీ జరిమానా విధించిన రిజర్వ్‌ బ్యాంకు.. కారణం ఇదే..!