
అక్టోబర్ 19 నుంచి కొత్త వారం మొదలవుతోంది. కొత్త వీక్ వస్తుందంటేనే ఆర్దికపరంగా మనల్ని ప్రభావితం చేసే అనేక మార్పులు జరుగుతుంటాయి. బ్యాంక్ హాలీడేస్ మారడంతో పాటు ఆర్దిక విషయాల్లో కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తుంటాయి. దీంతో వీటి గురించి ప్రతీఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్ధిక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ముఖ్యంగా దసరా, దుర్గాపూజ క్రమంలో వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఆర్ధిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలంటే బ్యాంక్ సెలవుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు వచ్చే వారంలో బ్యాంక్ బ్రాంచులను సందర్శించాలనుకుంటే సెలవులు గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. దీని వల్ల ఎలాంటి అసౌకర్యాన్ని గురికాకుండా సేవలు పొందవచ్చు. అక్టోబర్ 19 నుంచి 25వ తేదీ వరకు బ్యాంక్ సెలవుల గురించి ఒక్కసారిగా తెలుసుకుందాం.
మహానవమి, దుర్గాపూజ, దసరా, ఇతర ప్రాంతీయ పండుగల కారణంగా వచ్చే వారంలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు వచ్చాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు ఉంటాయి. ప్రాంతీయ సెలవులను బట్టి రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవులు మారుతూ ఉంటాయి. దీంతో మీ ప్రాంతంలో ఏయే రోజు బ్యాంక్ సెలవులు ఉంటాయనేది తెలుసుకోవాలి. బ్రాంచ్కు వెళ్లేముందు ఒకసారి సిబ్బందిని సంప్రదించి సమాచారం తెలుసుకోవడం ఉత్తమం. స్థానిక పండుగల కారణంగా నగరాల వారీగా బ్యాంక్ సెలవుల్లో మార్పులు ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. వచ్చే వారంలో మూడ్రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏయే రోజుల్లో అనేది చూద్దాం.
-అక్టోబర్ 19వ తేదీన మహాష్టమి, మహా నవమి, ఆయుధ పూజ, దుర్గా పూజ, విజయదశమి వంటి పండుగల కారణంగా పలు సిటీల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి.
-అక్టోబర్ 20వ తేదీన విజయదశమి సందర్బంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఉండవు.
-అక్టోబర్ 21న విజయదశమి, దుర్గా పూజ, మహాదశమిని పురస్కరించుకుని అగర్తలా, బెంగళూరు, గాంగ్టక్, గౌహతి, కోల్కతా, కొచ్చి, షిల్లాంగ్, తిరువనంతపురంలో బ్యాంకులు మూతపడనున్నాయి.
-అక్టోబర్ 22న దుర్గా పూజ (దసరా) సందర్భంగా గాంగ్టక్లోని బ్యాంకులు పనిచేయవు.
-అక్టోబర్ 23న దుర్గా పూజ సందర్భంగా గాంగ్టక్లోని బ్యాంకులు మూతపడనున్నాయి.
-అక్టోబర్ 24న నాలుగో శనివారం వస్తుండటంతో బ్యాంకులు మూతపడతాయి.
అక్టోబర్ 25న ఆదివారం కావడంతో బ్యాంకులు అన్ని రాష్ట్రాల్లో మూతపడతాయి.