Bank Holidays in March 2022: ప్రతి రోజు చాలా మంది బ్యాంకుకు(Bank) సంబంధించిన లావాదేవీలు జరుపుతుంటారు. అయితే బ్యాంకులకు ప్రతి నెల ఏయే రోజున సెలవు ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు(Bank Holidays) ఉంటాయి.. ఏయే రోజు బ్యాంకులు పనిచేస్తాయనే విషయం ముందస్తుగా తెలుసుకుంటే ఇబ్బంది లేకుండా బ్యాంకు సంబంధించిన పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇక మార్చి నెలలో బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. మార్చి నెల సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి.
మార్చి 1: (మహాశివరాత్రి)- అగర్తలా, ఐజ్వాల్, చెన్నై, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, షిల్లాంగ్‌లలో మినహా బ్యాంకులు మూతపడనున్నాయి.
మార్చి 3: (లోసార్) – గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు.
మార్చి 4: (చాప్‌చార్ కుట్) – ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు.
మార్చి 6: ఆదివారం
మార్చి 12: శనివారం (నెలలో రెండవ శనివారం)
మార్చి 13: ఆదివారం
మార్చి 17 : (హోలికా దహన్)- డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీలలో బ్యాంకులు మూతపడనున్నాయి.
మార్చి 18: (హోలీ / ధూలేటి / డోల్ జాత్రా) – బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, తిరువనంతపురం మినహా బ్యాంకులకు సెలవులు.
మార్చి 19:(హోలీ / యాయోసాంగ్ రెండవ రోజు) – భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలో బ్యాంకులకు సెలవులు.
మార్చి 20: ఆదివారం
మార్చి 22: (బీహార్ డే) – పాట్నాలో బ్యాంకులకు సెలవు.
మార్చి 26: శనివారం (నాలుగో శనివారం)
మార్చి 27: ఆదివారం
RBI దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ. రాష్ట్రంలోని ప్రత్యేక పండుగలు, సందర్భాల ఆధారంగా ప్రతి క్యాలెండర్ సంవత్సరం ప్రారంభంలో RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే జాబితాను జారీ చేస్తుంది. దీని వలన ఉద్యోగులు, కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
Also Read: Gold Rate Today: తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న బంగారం.. ఎప్పటి వరకు తగ్గొచ్చంటే..