Bank Holidays: జూన్‌ నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..!

Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ప్రాంతీయ పండుగలు, స్థానిక వేడుకలు, తదితర కారణాల వల్ల మూసి ఉండే అవకాశం ఉంది. అందుకే మీరు బ్యాంకు పనుల నిమిత్తం..

Bank Holidays: జూన్‌ నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..!
Bank Holidays

Updated on: Jun 01, 2026 | 9:41 AM

Bank Holidays: ఈ సెలవు దినాల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతున్నప్పటికీ, బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. ఈ నెలలో బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్న వినియోగదారుల సౌలభ్యం కోసం ముందస్తుగా ఈ జూన్‌ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. జూన్ నెలలో జూన్ 7, 14, 21, 28 తేదీలలో నాలుగు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అదనంగా జూన్ 13 (రెండవ శనివారం), జూన్ 27 (నాల్గవ శనివారం) తేదీలలో కూడా బ్యాంకులు పనిచేయవు. ఈ వారపు సెలవులతో పాటు, ప్రాంతీయ పండుగలు, స్థానిక వేడుకల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులు అదనంగా ఐదు రోజులు మూసి ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి: 1 June Rule Change: బిగ్‌ అలర్ట్‌.. జూన్ 1 నుండి ఈ నిబంధనలు మారాయని మీకు తెలుసా..?

జూన్ నెల బ్యాంకు సెలవుల జాబితా

  • జూన్ 7: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌.
  • జూన్ 13: రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్‌.
  • జూన్ 14: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌.
  • జూన్ 15: యంగ్ మిజో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • జూన్ 21: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  • జూన్ 25: మొహర్రం కారణంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
  • జూన్ 26: మొహర్రం పండుగ సందర్భంగా అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • జూన్ 27: నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  • జూన్ 28: ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  • జూన్ 29: సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు.
  • జూన్ 30: రెమ్నా నీ కారణంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఇది కూడా చదవండి: LPG Gas Price: బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర.. ఎంత పెరిగిందంటే..!

ఇవి కూడా చదవండి

పైన పేర్కొన్న బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ప్రాంతీయ పండుగలు, స్థానిక వేడుకలు, తదితర కారణాల వల్ల మూసి ఉండే అవకాశం ఉంది. అందుకే మీరు బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తున్నట్లయితే మీ ప్రాంతాల్లో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుని వెళ్లడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us