
Christmas Eve Bank Holidays: మీరు బుధవారం, డిసెంబర్ 24న బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే అనేక నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల బ్యాంకుకు వెళ్లే ముందు మీ నగరంలోని బ్యాంకు సెలవులను తనిఖీ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. అందుకే ముందస్తుగా బ్యాంకుల సెలవుల జాబితాను తనిఖీ చేయడం ముఖ్యం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. క్రిస్మస్ ముందు రోజు డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ జరుపుకుంటారు. రేపు క్రిస్మస్ ఈవ్ కోసం ఏ నగరాలలో సెలవు ఉంటుందో తెలుసుకుందాం.
డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ కారణంగా అనేక నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. క్రిస్మస్ ఈవ్ కారణంగా నాగాలాండ్, మేఘాలయ, మిజోరాంలలో బ్యాంకులకు సెలవు. నాగాలాండ్, మేఘాలయ, మిజోరం మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, నగరాల్లో రేపు బ్యాంకులు తెరిచి ఉంటాయి. మీరు ఢిల్లీ లేదా ముంబై వంటి నగరాల్లో నివసిస్తుంటే మీరు రేపు బ్యాంకును సందర్శించవచ్చు. డిసెంబర్ 25న క్రిస్మస్ కారణంగా అన్ని రాష్ట్రాలు, నగరాల్లో బ్యాంకులకు సెలవు.
ఇది కూడా చదవండి: Electric Splendor Bike: పాత స్ప్లెండర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చుకోండి.. కిట్ కేవలం రూ.35,000కే.. రేంజ్ ఎంతో తెలుసా?
డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం నాడు అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు కూడా మూసి ఉంటాయి. క్రిస్మస్ వేడుకల కారణంగా మేఘాలయ, మిజోరం, తెలంగాణలో బ్యాంకులు డిసెంబర్ 26న మూసి ఉంటాయి. అమరవీరుడు ఉధమ్ సింగ్ జయంతి కారణంగా ఈ రోజు హర్యానాలో కూడా బ్యాంకులకు సెలవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి