Bank Deposits: ఇటీవల కాలంలో బ్యాంకుల్లో డిపాజిట్లు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మన దేశంలో బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్ల మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 150 లక్షల కోట్ల రూపాయలు. గతేడాది ఇదే సమయానికి ఉన్న డిపాజిట్ల మొత్తం కంటే ఇది 11 శాతం ఎక్కువ. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ సంవత్సరంలో బ్యాంకులకు డిపాజిట్లు ఎలా ప్రవాహంలా వచ్చిపడ్డాయనేది. ఇలా అనూహ్యంగా డిపాజిట్లు పెరగటం పై బ్యాంకు వర్గాలు హాశం వ్యక్తం చేస్తూనే.. ఆశ్చర్యానికి గురవుతున్నారు. డిపాజిట్ల పెరుగుదల ఇంతలా ఉండటానికి కారణాలు ఏమిటనేదానిపై వారు ఇలా విశ్లేషిస్తున్నారు.
డిపాజిట్ల సేకరణలో ప్రభుత్వ బ్యాంకులతో ప్రయివేటు బ్యాంకులు పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. హెచ్ డీ ఎఫ్ సి , ఫెడరల్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకులు డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధి చూపించాయి. హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు వద్ద 16. 3 శాతం, ఫెడరల్ బ్యాంకులో 13 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకుకు 27 శాతం డిపాజిట్లు పెరిగాయి.
Also Read: Bank holidays April 2021: బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవు.. ఎప్పటినుంచి.. ఎప్పటివరకంటే..?
ఐదువేలతో అదిరిపోయే బిజినెస్..! ఇంట్లో నుంచే పని చేయండి.. లక్షలు సంపాదించండి.. ఎలాగో ఓ లుక్కేయండి..