బజాజ్ సరికొత్త స్పోర్ట్స్ బైక్ “పల్సర్ RS200” వచ్చేసింది.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో బజాజ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కాగా ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ ప్రియులను ఆకట్టుకునేలా తమ పాపులర్ పల్సర్ RS200 ను సరికొత్త హంగులు, అధునాతన ఫీచర్లతో అప్‌డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,98,441గా నిర్ణయించింది.

బజాజ్ సరికొత్త స్పోర్ట్స్ బైక్ పల్సర్ RS200 వచ్చేసింది.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!
Bajaj Pulsar Rs200

Updated on: Nov 22, 2026 | 10:12 AM

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో బజాజ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సామాన్యుల కమ్యూటర్ బైక్‌ల నుంచి యువతను ఉర్రూతలూగించే పల్సర్ సిరీస్ వరకు బజాజ్ బైక్‌లకు ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కాగా ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ ప్రియులను ఆకట్టుకునేలా తమ పాపులర్ పల్సర్ RS200 ను సరికొత్త హంగులు, అధునాతన ఫీచర్లతో అప్‌డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,98,441గా నిర్ణయించింది.

పల్సర్ RS200 అప్‌డేటెడ్ ఫీచర్స్..

మరింత పవర్‌ఫుల్ ఇంజిన్..

కాగా ఈ కొత్త పల్సర్ RS200లో 199.5 సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించినప్పటికీ పనితీరును మరింత మెరుగుపరిచినట్టు చెబుతున్నారు. గతంలో 24.5 PSగా ఉన్న గరిష్ఠ శక్తిని ఇప్పుడు 25.5 PSకు పెంచారు (10,000 ఆర్‌పీఎం వద్ద). ఇక గరిష్ఠ టార్క్ 18.7 Nm వద్ద యథాతథంగా కొనసాగుతోంది.

ఎలక్ట్రానిక్ థ్రాటిల్..

ఈసారి బజాజ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో భారీ అప్‌గ్రేడ్స్ అందించింది. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ ద్వారా రైడర్ అవసరాలకు అనుగుణంగా థ్రాటిల్ స్పందనను నియంత్రించుకునే అవకాశం కల్పిస్తుంది.

5 రైడింగ్ మోడ్స్..

ఈ కొత్త స్పోర్ట్స్ బైకులో స్పోర్ట్ (Sport), రోడ్ (Road), రెయిన్ (Rain), ఆఫ్-రోడ్ (Off-road), టూర్ (Tour) అనే ఐదు రైడింగ్ మోడ్స్‌ను అందించారు.

క్విక్‌షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్..

స్పోర్ట్స్ షిఫ్టర్ పేరుతో బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను అందించడంతో క్లచ్ వాడకుండానే గేర్లను సులభంగా పైకి, కిందికి మార్చుకోవచ్చని తెలుస్తోంది. వేగం పెంచే సమయంలో వెనుక చక్రం జారిపోకుండా ట్రాక్షన్ కంట్రోల్ సదుపాయాన్ని కూడా జోడించారు.

అప్‌గ్రేడెడ్ సస్పెన్షన్ & టైర్లు..

ఇక బైక్ హ్యాండ్లింగ్, మలుపుల్లో స్థిరత్వాన్ని పెంచేందుకు పాత టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ స్థానంలో 37 మి.మీ. అప్‌సైడ్ డౌన్ (USD) ఫోర్క్స్‌ను అమర్చారు. వెనుకవైపు మెరుగైన గ్రిప్ కోసం 140/70-R17 రేడియల్ టైర్‌ను అందించారు.

కొత్త 5 అంగుళాల TFT డిస్‌ప్లే..

పాత కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే స్థానంలో సరికొత్త 5 అంగుళాల టీఎఫ్‌టీ (TFT) స్క్రీన్‌ను తీసుకొచ్చారు.

కనెక్టివిటీ..

గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ సపోర్ట్ ఉండటంతో నావిగేషన్ వివరాలను నేరుగా స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు. వీటితో పాటు యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, అడ్జస్టబుల్ హ్యాండ్ లీవర్లు, హజార్డ్ లైట్లు, పానిక్ బ్రేక్ అలర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

ధర..

కొత్త బజాజ్ పల్సర్ RS200 ఎక్స్-షోరూమ్ ధర రూ.1,98,441గా ఉంది (పాత మోడల్‌తో పోలిస్తే రూ.16,773 అదనం). రూ.1-2 లక్షల బడ్జెట్ టూవీలర్లకు తెలంగాణలో ఉండే 15% లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఫీజులను కలిపి హైదరాబాద్‌లో రూ.2.42-2.46 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలానే విశాఖపట్నం, విజయవాడల్లో మొదటి బైక్ కొనుగోలుపై ఉండే 9% లైఫ్ ట్యాక్స్, దానిపై 10% రోడ్డు సేఫ్టీ సెస్‌తో పాటు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలుపుకుని ఆన్-రోడ్ ధర సుమారు రూ.2.30-2.35 లక్షలుగా ఉండొచ్చని అంచనా.

ఇక 200 సీసీ స్పోర్ట్స్ బైక్ విభాగంలో ఇది హీరో కరిజ్మా XMR కంటే ఎక్కువ ధరలో ఉండగా.. KTM RC 200 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అధునాతన రైడింగ్ మోడ్స్, క్విక్‌షిఫ్టర్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ సెగ్మెంట్‌లో బజాజ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us