
Axis Bank: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉంటుంది. ప్రజలు తాము సంపాదించిన కొంత డబ్బును బ్యాంకులో జమ చేయడానికి ఖాతా తెరిచారు. వారు ఇక్కడ కొద్దికొద్దిగా డబ్బు జమ చేస్తుంటారు. కానీ ఇప్పుడు నగదు లావాదేవీల విషయంలో మీరు చాలా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ఒక ప్రైవేట్ బ్యాంకు అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అవి డిసెంబర్ నుండి అమలులోకి రానున్నాయి.
డిసెంబర్ 1, 2026 నుండి యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు కొన్ని బ్యాంకింగ్ సేవలకు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ, ఎన్నారై కస్టమర్ల పొదుపు ఖాతాలపై కొన్ని లావాదేవీల ఛార్జీలను బ్యాంక్ సవరిస్తోంది. దేశీయ, ఎన్నారై ఈజీ యాక్సెస్ పొదుపు ఖాతాలతో సహా కొన్ని పొదుపు ఖాతాలకు ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను తగ్గించాలని యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించింది. ముఖ్యంగా ఇది వ్యవసాయ, దేశీయ పొదుపు ఖాతాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ నిబంధనలు వచ్చే నెల అంటే డిసెంబర్ 1, 2026 నుండి అమలులోకి వస్తాయి. అందువల్ల ఈ బ్యాంకు ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలకు వర్తించే కొత్త నిబంధనలు, ఛార్జీల గురించి తెలుసుకోవడం ముఖ్యం.
ఇది కూడా చదవండి: BSNL: కేవలం 1 రూపాయికే 24 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ మతిపోగొట్టే ప్లాన్..!
ఏ నియమాలు మారుతున్నాయి?
1. బ్యాంకు ఉచిత నగదు లావాదేవీల పరిమితిని మార్చడమే కాకుండా, కనీస నిల్వను నిర్వహించనందుకు విధించే ఛార్జీలను కూడా పెంచింది.
2. సెమీ-అర్బన్ బ్రాంచ్‌ల విషయంలో ఈజీ యాక్సెస్ ఖాతా ఛార్జీలను రూ.300 నుండి రూ. 600 పెంచారు. మరోవైపు మెట్రో, అర్బన్ బ్రాంచ్‌ల విషయంలో గరిష్ట ఛార్జీ రూ.600 ఉంటుంది. ఈ సందర్భంలో కనీస నిల్వకు సంబంధించిన ఈ జరిమానా జీతం పొందే ఉద్యోగులకు, అంటే జీతం తీసుకునే కస్టమర్లకు వర్తించదు.
3. సెమీ-అర్బన్, గ్రామీణ శాఖలలో ఎన్ఆర్ఐ ఈజీ యాక్సెస్ ఖాతాకు విధించే జరిమానాను రూ. 300 నుండి రూ. 600 కు పెంచారు. అంతేకాకుండా, గ్రామీణ శాఖలలో ఈ ఛార్జీని రూ. 150 నుండి రూ. 600 కు పెంచనున్నారు.
4. ప్రస్తుతం ఈజీ యాక్సెస్, వ్యవసాయ, గృహ పొదుపు ఖాతా, ఎన్ఆర్ఐ ఈజీ యాక్సెస్ ఖాతాల కస్టమర్లు నెలకు నాలుగు ఉచిత నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే మొత్తం నగదు లావాదేవీల పరిమితి రూ. 1 లక్షగా ఉంది. ఈ పరిమితిని మించితే కస్టమర్లకు ఛార్జీ విధిస్తారు. అయితే ఈ నిబంధనలో కూడా మార్పు రాబోతోంది. ప్రస్తుతం ఉచిత నగదు లావాదేవీల సంఖ్య నాలుగుగా ఉండగా, డిసెంబర్ 1 నుంచి దానిని మూడుకు తగ్గించనున్నారు. కానీ రూ. 1 లక్ష నగదు లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. లావాదేవీల పరిమితి యథాతథంగా ఉంటుంది.
5. బ్యాంక్ కొంతమంది ఖాతాదారులకు ఎడ్జ్ రివార్డ్స్ పాయింట్లను కూడా నిలిపివేస్తోంది. కొన్ని ప్రీమియం ఖాతాలకు టోటల్ రిలేషన్షిప్ వాల్యూ (TRV) అవసరాలను కఠినతరం చేస్తోంది.
6. చెక్కులను తిరిగి ఇవ్వడానికి మొదటిసారి ఛార్జీ రూ. 50, ఆ తర్వాత ప్రతిసారికి రూ.100గా ఉండేది. ఇప్పటి నుండి దీనిని ప్రతి రిటర్న్‌కు స్థిరంగా రూ. 200కి పెంచుతారు.
7. ఎన్నారై బర్గుండి, ప్రయారిటీ, ప్రెస్టీజ్, ప్రైమ్ ఖాతాదారుల డెలివరబుల్ రిటర్న్‌ల ఛార్జీని ప్రతి రిటర్న్‌కు రూ. 50 నుండి రూ. 500కి, అంటే పది రెట్లు పెంచనున్నారు.
కొన్ని సందర్భాల్లో ఉచిత లావాదేవీల పరిమితిని మించిపోతే నగదు ఉపసంహరణలు లేదా డిపాజిట్ల కోసం కస్టమర్ల నుండి అదనపు రుసుములు వసూలు చేయవచ్చని గమనించండి. అందువల్ల మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉన్నట్లయితే, మీరు ఉచిత నగదు లావాదేవీల పరిమితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఇది కూడా చదవండి: Dhanteras: ధంతేరస్ నాడు బంగారం కొంటున్నారా? పేమెంట్ చేసే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి