APY Scheme: రోజుకు 7 రూపాయలు పొదుపు చేస్తే… రిటైర్‌మెంట్‌ తర్వాత బిందాస్‌గా ఉండొచ్చు.

|

Oct 28, 2023 | 6:32 PM

ఈ పథకంలో మీరు చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్‌ను పొందొచ్చు. ఈ పథకంలో చేరిన వారు నెలకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్‌ పొందొచ్చు. భార్యాభర్తలద్దరూ ఈ పథకంలో చేరితో నెలకు రూ. 10 వేలు పెన్షన్‌ పొందొచ్చు. అయితే ఈ పథకంలో చేరే వారి వయసు 40 ఏళ్లు మించకూడదు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారే ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో...

APY Scheme: రోజుకు 7 రూపాయలు పొదుపు చేస్తే... రిటైర్‌మెంట్‌ తర్వాత బిందాస్‌గా ఉండొచ్చు.
Apy Scheme
Follow us on

ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ ఆదాయం రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి రిటైర్‌మెంట్‌ తర్వాత ఎలాగో మంచి పెన్షన్‌ వస్తుంది. మరి ప్రైవేటీ సంస్థల్లో, రోజువారీ కూలీ పనులు చేసుకునే వారు, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారి పరిస్థితి ఏంటి..? ఇలాంటి వారికి వృద్ధాప్యంలో పెన్షన్‌ పొందడం ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం అటల్‌ పెన్షన్‌ యోజన పేరుతో ఓ మంచి పథకాన్ని తీసుకొచ్చింది.

ఈ పథకంలో మీరు చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్‌ను పొందొచ్చు. ఈ పథకంలో చేరిన వారు నెలకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్‌ పొందొచ్చు. భార్యాభర్తలద్దరూ ఈ పథకంలో చేరితో నెలకు రూ. 10 వేలు పెన్షన్‌ పొందొచ్చు. అయితే ఈ పథకంలో చేరే వారి వయసు 40 ఏళ్లు మించకూడదు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారే ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో భాగంగా 20 ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీకు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు.

ఉదాహరణకు మీ వయసు 18 ఏళ్లు ఉందని అనుకోండి. ఆ సమయంలో మీరు పథకంలో చేరితో ప్రతి నెల రూ. 210 అంటే రోజుకు రూ. 7 పెట్టుబడి పెడితే చాలు నెలకు రూ. 500 పెన్షన్‌ పొందొచ్చు. ఒకవేళ మీకు రూ. వెయ్యి పెన్షన్ పొందాలనుకుంటే మీరు 18 ఏళ్ల వయసు నుంచి మీరు నెలకు కేవలం రూ. 42 డిపాజిట్ చేస్తే చాలు. ఒకవేళ పథకంలో చేరిన భర్త 60 ఏళ్ల లోపు మరణిస్తే భార్యకు పెన్షన్‌ అందిస్తారు. ఒకవేళ భార్యభర్తలిద్దరూ మరణిస్తే నామినీకి అప్పటి వరకు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.

ఇక అటల్‌ పెన్షన్‌ యోజన పథకంలో చేరాలంటే మీరు పోస్టాఫీస్‌లో ఖాతా తీయాలి. మొబైల్‌ నెంబర్‌ లింక్‌ అయిన ఆధార్‌ కార్డ్ ఉండాలి. ఈ పథకంలో పెట్టుబడిని నెలవారీ, త్రైమాసిక, ఆరు నెలలకు ఒకసారి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఆటో డెబిట్ సౌకర్యం కూడ అందుబాటులో ఉంది. దీంతో మీ సేవింగ్స్‌ అకౌంట్‌ నుంచి నెల నెలకు డబ్బు ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా కూడా చేసుకోవచ్చు. రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్‌ 80సీ కింద ఈ మినహాయింపు పొందొచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..