Amazon
పండుగ ఏదైనా సెలెబ్రేషన్ మాత్రం ఆన్ లైన్ ప్లాట్ ఫారంలలోనే కనిపిస్తోంది. ఏదోక సేల్స్ ను తీసుకువస్తుండటంతో వినియోగదారులు వాటిల్లో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా అన్ని ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫారంలు కూడా ఫెస్టివల్ సేల్స్ ను ప్రారంభించాయి. వాటిల్లో అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్ 2024ను నిర్వహిస్తోంది. దీనిలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లను అందిస్తోంది. వాటిల్లో ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్స్, హెడ్ ఫోన్స్, కెమెరాలు వంటివి ఉన్నాయి. ప్రముఖ సంస్థలైన డెల్, శామ్సంగ్, అసుస్, నాయిస్, గోప్రో వంటి వాటి నుంచి గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిపై అమెజాన్ తగ్గింపులతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులపై 10శాతం వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. అలాంటి వాటిల్లో కొన్ని బెస్ట్ డీల్స్ మీకు పరిచయం చేస్తున్నాం.
- అసుస్ టఫ్ గేమింగ్ ఎఫ్17 ల్యాప్‌టాప్.. దీనిలో ఆర్టీఎక్స్ 2050 గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది. 11వ తరం ఇంటెల్ కోర్ 15 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్‌తో పాటు అనేక ఇతర ఫీచర్లు ఉంటాయి. దీనిని అమెజాన్ అధికారిక వెబ్ సైట్లో రూ. 65,990కి కొనుగోలు చేయొచ్చు.
- డెల్ 15 ల్యాప్ టాప్.. 12-తరం ఇంటెల్ కోర్ 13 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డీ, మెకాఫీ మల్టీ- డివైస్ ప్రొటెక్షన్ వంటి ఆకట్టుకునే ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. దీనిపై ఉత్తమ డీల్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీనిని అమెజాన్ ప్లాట్‌ఫాంలో కేవలం రూ. 35,990కి దక్కించుకోవచ్చు.
- గోప్రో హీరో12.. ఈ కెమెరా అత్యుత్తమ నాణ్యతతో చిత్రాలను అందిస్తుంది. చాలా తేలికగా ఉంటుంది. 5.3కే నాణ్యతతో చిత్రాలను తీయొచ్చు. అలాగే ఈ కెమెరాలో హైపర్ వ్యూ, సూపర్ వ్యూ డిజిటల్ లెన్స్‌వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. 33 అడుగల వరకూ వాటర్ ప్రూఫ్‌గా ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 34,990గా ఉంది.
- జేబీఎల్ ట్యూన్ 245ఎన్‌సీ.. స్పష్టమైన బాస్ సౌండ్‌తో కూడిన ఇయర్ బడ్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. నాలుగు మైక్రోఫోన్లతో క్రిస్టల్-క్లియర్ ఆడియోను ప్లగ్ – అండ్ ప్లే చేస్తుంది. టీడబ్ల్యూఎస్ ఏఎన్‌సీతో వస్తుంది. ఐపీ 54 వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌తో వస్తుంది. 48 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. రూ. 4,499గా ఉంది.
- కీబోర్డ్ లాజిటెక్ కే580 స్లిమ్.. మీరు టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు, పీసీల కోసం ఈ బ్లూట్ కీబోర్డు బాగా ఉపకరిస్తుంది. ఈజీ-స్విచ్ డయల్ ఫీచర్ సహాయంతో కనెక్ట్ చేయబడిన మూడు బ్లూటూత్ వైర్లెస్ పరికరాల్లో టైపింగ్ సులభంగా మారవచ్చు. అమెజాన్లో దీని ధర రూ. 3,495గా ఉంది.
- నాయిస్ పల్స్ 4 మ్యాక్స్.. ఈ స్మార్ట్ వాచ్ 1.96 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లేతో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్, వర్కింగ్ క్రాన్, అనేక ఇతర సామర్థ్యాలు ఉన్నాయి. ఇది ఏఐ సపోర్టుతో పనిచేస్తుంది. మెటాలిక్ డయల్ ఫినిషింగ్ స్టైలిష్ లుక్ అందిస్తుంది. దీనిని అమెజాన్లో రూ.2,799కి కొనుగోలు చేయొచ్చు.
- శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్.. దీనిలో డాల్బీ అట్మోస్ 3డీ సరౌండ్ సౌండ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని సన్నని డిజైన్, తక్కువ బరువు వినియోగాన్ని సులభతరం చేస్తుంది. దీని ధర అమెజాన్లో రూ.20,999కి కొనుగోలు చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..