HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. ఏప్రిల్‌ 13న ఆన్‌లైన్ సేవలకు అంతరాయం.. ఏయే సమయాల్లో అంటే..

ఈ రోజుల్లో బ్యాంకింగ్‌ రంగం మరింతగా అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఏదైనా లావాదేవీలైనా, ఇతర పనులకైనా బ్యాంకులకు వెళ్లి పనులు చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం బ్యాంకు పనుల కోసం బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి..

HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. ఏప్రిల్‌ 13న ఆన్‌లైన్ సేవలకు అంతరాయం.. ఏయే సమయాల్లో అంటే..
Hdfc

Updated on: Apr 12, 2024 | 9:56 PM

ఈ రోజుల్లో బ్యాంకింగ్‌ రంగం మరింతగా అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఏదైనా లావాదేవీలైనా, ఇతర పనులకైనా బ్యాంకులకు వెళ్లి పనులు చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం బ్యాంకు పనుల కోసం బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి చేసుకునే సదుపాయం వచ్చేది. ఇక తాజాగా దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కస్టమర్లను అలర్ట్ చేసింది. తమ ఆన్‌లైన్‌ సేవల్లో కొంత అంతరాయం ఏర్పడనున్నట్లు వినియోగదారులకు సందేశాలు పంపింది.

తమ సర్వీర్లను మరింతగా మెరుగు పర్చేందుకు చేస్తున్న పనుల్లో భాగంగా కొంత అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఈ అంతరాయం ఏప్రిల్‌ 13వ తేదీన అర్ధరాత్రి అంటే ఉదయం 2 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు బ్యాంకు సిస్టమ్‌లో కొంత అంతరాయం ఏర్పడుతుందని, దీనిని బ్యాంకు కస్టమర్లు గమనించాలని కోరింది. ఏయే సేవల్లో అంతరాయం ఏర్పడనుందో తెలిపింది. అకౌంట్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌, డిపాజిట్స్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ అంటే ఐఎంపీఎస్‌, యూపీఐ, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌, పేమెంట్‌ సర్వీస్‌లు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ విషయాన్ని బ్యాంకు వినియోగదారులు గమనించాలని తెలిపింది.

Hdfc Bank

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి