మహిళలు ఇంట్లో ఉంటూనే వ్యాపారం చేయడానికి ఎన్నో బిజినెస్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ మంచి బిజినెస్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. భారత దేశం అంటే ముందుగా గుర్తొచ్చేది సంప్రదాయాలు, ఆచారాలు. పూజలకు పెట్టింది పేరైన భారత్‌లో అగర్ బత్తీలకు ఉండే డిమాండ్ ఎలాంటి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం హిందువులకే పరిమితం కాకుండా ముస్లింలు కూడా అగర్ బత్తీలను ఉపయోగిస్తుంటారు.
దైవ పూజలో కీలక పాత్ర పోషించే అగర్‌బత్తీల తయారీని ప్రారంభించే భారీగా లాభాలు పొందొచ్చు. సీజన్‌తో, కాలంతో ఎలాంటి సంబంధం లేకుండా అగర్‌బత్తీలకు గిరాకీ ఉంటుంది. ఇక అగర్ బత్తీల తయారీకి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. ఇంట్లోనే తక్కువ బడ్జెట్‌తో అగర్‌బత్తీలను తయారీని ప్రారంభించవచ్చు. ఇంతకీ అగర్ బత్తీల తయారీని ఎలా ప్రారంభించాలి.? ఎంత పెట్టుబడి అవసరపడుతుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అగర్‌బత్తీలను వెదురుతో తయారు చేస్తారు. ఇందుకోసం వెదురు కర్రలను సన్న భాగాలుగా చేసి.. వాటికి పూలు లేదా గంధంతో తయారు చేసిన సుగంధ ద్రవ్యాల ముద్దను పూత పూయాలి. అగర్‌బత్తీ మంచి వాసన రావడానికి ఇదే కారణం. అగర్‌బత్తీల తయారీ మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మిషన్ ధర రూ. 3500 నుంచి రూ. 17,500 వరకు ఉంటుంది. ఈ మిషన్ సహాయంతో నిమిషానికి 150 నుంచి 200 వరకు అగర్‌బత్తీలను తయారు చేయవచ్చు.
యంత్రాలను కొనుగోలు చేసిన తర్వాత.. మిక్సర్, డ్రైయర్, ప్రధాన ఉత్పత్తి యంత్రం ఉన్నాయి. మిక్సర్ యంత్రం ముడి పదార్థాన్ని పేస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ప్రధాన ఉత్పత్తి యంత్రం వెదురుపై పేస్ట్‌ను చుట్టడానికి పని చేస్తుంది. చివరిది డ్రైయర్.. ఇది అగర్బత్తీలను ఆరబెడుతుంది. ఇక తయారీ పూర్తయిన తర్వాత సొంత బ్రాండింగ్‌తో సేల్ చేసుకోవచ్చు. సరైన మార్కెటింగ్ ద్వారా నెలకు తక్కువలో తక్కువ నెలకు రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు ఆర్జించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..