Wearable devices: ఊహకందని వేగంతో దూసుకుపోతున్న వేరబుల్‌ డివైజ్ రంగం.. 2030 నాటికి ఏకంగా..

|

Sep 23, 2023 | 3:42 PM

ఊహకందని వేగంతో టెక్నాలజీ రంగంలో సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. తాజా గణంకాల ప్రకారం వేరబుల్ డివైజ్‌ తయారీ ఇండస్ట్రీ ఏకంగా 14.3 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించింది. 2030 నాటికి ఈ రంగం ఏకంగా 290.9 బిలియన్లకు చేరుకుంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక 2023 నాటికి ఈ రంగం కచ్చితంగా 99.5 బిలియన్‌ డాలర్లు చేరిందని డేటా అండ్‌ అనలిటిక్స్‌ కంపెనీ గ్లోబల్ డేటా తెలిపింది...

Wearable devices: ఊహకందని వేగంతో దూసుకుపోతున్న వేరబుల్‌ డివైజ్ రంగం.. 2030 నాటికి ఏకంగా..
Wearable Devices
Follow us on

టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల ఆవిష్కరణల కారణంగా మార్కెట్లోకి ఎన్నో కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఒకప్పుడు మొబైల్ రావడమే పెద్ద గొప్ప అనుకున్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లు ప్రపంచాన్నే మార్చేశాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతం మరింత అడ్వాన్స్‌ టెక్నాలజీతో కూడిన వేరబుల్ డివైజ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. మనిషి ధరించడానికి వీలుగా ఉండే గ్యాడ్జెట్స్‌దే ఇప్పుడు రాజ్యం. స్మార్ట్ వాచ్‌లు మొదలు స్మార్ట్ గ్లాసెస్‌, స్మార్ట్ రింగ్‌ ఇలా వేరబుల్‌ మార్కెట్ ఇప్పుడు ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది.

ఊహకందని వేగంతో టెక్నాలజీ రంగంలో సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. తాజా గణంకాల ప్రకారం వేరబుల్ డివైజ్‌ తయారీ ఇండస్ట్రీ ఏకంగా 14.3 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించింది. 2030 నాటికి ఈ రంగం ఏకంగా 290.9 బిలియన్లకు చేరుకుంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక 2023 నాటికి ఈ రంగం కచ్చితంగా 99.5 బిలియన్‌ డాలర్లు చేరిందని డేటా అండ్‌ అనలిటిక్స్‌ కంపెనీ గ్లోబల్ డేటా తెలిపింది. లండన్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ గ్లోబల్ డేటా వేరబుల్ టెక్‌ నివేదిక (2023)ని విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం యాపిల్ వాచ్‌, ఫిట్‌బిట్‌ ట్రాకర్‌లకు విపరీతమైన క్రేజ్‌ ఉన్నట్లు తేలింది. స్మార్ట్‌ వాచ్‌ల తర్వాత ఆడియో, హెల్త్‌ మానిటరింగ్‌ డివైజ్‌లకు ఆదరణ లభిస్తున్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బేస్డ్‌గా పనిచేసే కమ్యూనికేషన్‌ డివైజ్‌లకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్నట్లు గ్లోబల్ డేటా పేర్కొంది. ఈ విషయమై గ్లోబల్‌ డేటా థీమాటిక్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌ సీనియర్‌ అనలిస్ట్‌ పింకీ హీరానందన్‌ మాట్లాడుతూ.. ‘వేరబుల్ డివైజ్‌ల ద్వారా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు సైతం తెలుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ దీనికి ఉపయోగకరంగా మారడంతో వేరబుల్ డివైజ్‌లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్‌ దక్కింది’ అని చెప్పుకొచ్చారు.

వచ్చే మూడేళ్లలోనూ వేరబుల్‌ డివైజ్‌లకు మరింత క్రేజ్‌ పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రంగంలో పుష్కలమైన అభివృద్ధి ఉంటుందని చెబుతున్నారు. పర్యాటకం, ఆరోగ్యం, ప్రయాణం, రక్షణ ఇలా అన్ని రంగాల్లో వేరబుల్‌ డివైజ్‌ల ఉపయోగం అనివార్యంగా మారుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రోగుల ఆరోగ్య స్థితి గతులను అంచన వేయడానికి ఈ వేరబుల్ డివైజ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. తక్కువ బరువుతో అధునాతన ఫీచర్లతో కూడిన వేరబుల్ డివైజ్‌లను రూపకల్పన చేయడం వల్ల కంపెనీలు సైతం భారీగా ఆధాయాన్ని ఆర్జించే అవకాశాలు ఉన్నట్లు గ్లోబల్‌ డేటా పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..