Aadhar Update: ఆధార్ ఉచిత సేవ.. ఇక రెండు రోజులే సమయం.. తప్పులుంటే వెంటనే సరిచేసుకోండి..

|

Sep 12, 2024 | 6:15 PM

ఈ కార్డులో వివరాలు నమోదు చేసుకొన్నప్పుడు కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉంది. లేకపోతే వేరే ఊరు వలస వెళ్లిపోవచ్చు. పుట్టిన తేదీ వివరాలు తప్పుగా ఉండవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు సరిచేసుకోవడం చాలా అవసరం. ఏ సమయంలో అయినా వీటిని సరిదిద్ధుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆధార్ కార్డులో తప్పులను ఉచితంగా సరిచేసుకోనే అవకాశం ఉంది.

Aadhar Update: ఆధార్ ఉచిత సేవ.. ఇక రెండు రోజులే సమయం.. తప్పులుంటే వెంటనే సరిచేసుకోండి..
Aadhaar
Follow us on

దేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు అత్యవసరం. ప్రభుత్వం నుంచి పథకాలు పొందటానికి, మీ రోజు వారీ లావాదేవీలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు లేకపోతే దేశంలో మీకు గుర్తింపు లేనట్టే. అయితే ఈ కార్డులో వివరాలు నమోదు చేసుకొన్నప్పుడు కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉంది. లేకపోతే వేరే ఊరు వలస వెళ్లిపోవచ్చు. పుట్టిన తేదీ వివరాలు తప్పుగా ఉండవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు సరిచేసుకోవడం చాలా అవసరం. ఏ సమయంలో అయినా వీటిని సరిదిద్ధుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆధార్ కార్డులో తప్పులను ఉచితంగా సరిచేసుకోనే అవకాశం ఉంది. సెప్టెంబర్ 14వ తేదీలోపు అందరికీ ఉచిత సేవ అందుబాటులో ఉంది.

14 వరకూ ఉచితమే..

ఆధార్ కార్డులో వివరాలను అప్ డేట్ చేసుకోవాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఈ నెల 14వ తేదీలోపు ఉచితంగా ఈ అవకాశం పొందవచ్చు. చిరునామా, పేరు,పుట్టిన తేదీలను మార్చుకోవచ్చు. ఇంటి నుంచే ఆన్ లైన్ లో వీటిని ఉచితంగా సరిచేసుకోనే అవకాశం ఉంది. అలాగే ఆధార్ తీసుకున్న పదేళ్లయిన వారందరూ కూడా తమ కార్డులను అప్ డేట్ చేసుకోవాలి.

ఆన్ లైన్‌లో ఆధార్‌ను సరిచేసుకునే విధానం..

  • ముందుగా యూఐడీఏఐ వెబ్ సైట్‌ను సందర్శించాలి.
  • డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూఐడీఏఐ.జీవోవి.ఇన్‌లో లాగిన్ అవ్వండి.
  •  ‘మై ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయాలి. అనంతరం మెనూ నుంచి ‘అప్ డేట్ యువర్ ఆధార్‘ను ఎంచుకోండి.
  • ఆ తర్వాత ‘అప్ డేట్ ఆధార్ డిటైల్స్‘ అనే పేజీ ఓపెన్ అవుతుంది.
  • అనంతరం ‘డాక్యుమెంట్ అప్‌డేట్’పై క్లిక్ చేయండి.
  • దానిలో మీ యూఐడీ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. సెంట్ ఓటీపై క్లిక్ చేస్తే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్‌ వస్తుంది.
  • ఓటీపీని నమోదు చేసిన తర్వాత ‘లాగిన్’పై క్లిక్ చేయండి. అప్‌డేట్ చేయాలనుకుంటున్న వివరాలను (పేరు, చిరునామా, పుట్టిన తేదీ) ఎంచుకోండి. వాటిని సక్రమంగా, తప్పులు లేకుండా పూర్తి చేయండి.
  • అవసరమైన మార్పులు చేసిన తర్వాత, వినియోగదారులు ‘సమర్పించు’పై క్లిక్ చేసి, అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.
  • చివరగా ‘సమర్పించు అప్‌డేట్ అభ్యర్థన’పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ ద్వారా అప్‌డేట్ అభ్యర్థన సంఖ్య (యూఆర్ఎన్)ను అందుకుంటారు.

ఇవి గుర్తుపెట్టుకోండి..

  • ఐరిస్ స్కాన్‌లు, వేలిముద్రలు, ముఖచిత్రాలు వంటి బయోమెట్రిక్ వివరాలు ఆన్‌లైన్‌లో అప్ డేట్ కావు. పుట్టిన తేదీ, జెండర్ మార్పులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
  • ఒకవేళ ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో మీ వివరాలు అప్‌డేట్ చేయాలనుకుంటే యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. దాన్ని పూర్తి చేసి, అవసరమైన పత్రాలతో మీ సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్, లేదా ఆధార్ సేవా కేంద్రంలో సమర్పించండి.
  • ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14వ తేదీ వరకూ మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత రుసుము చెల్లించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..