Small Saving Schemes: చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు షాక్‌.. ఈ నెలఖరులోపు ఆ పని చేయకపోతే మీ అకౌంట్‌ క్లాజ్‌..?

|

Sep 03, 2023 | 8:30 PM

ముఖ్యంగా చాలా మంది పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన పోస్టాఫీసు అకౌంట్స్‌లో సొమ్మును పొదుపు చేస్తూ ఉంటారు. అయితే పబ్లిక్ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), పోస్టాఫీసు డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు పథకాల పెట్టుబడిదారులు తమ ఆధార్ నంబర్‌ను పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖకు సమర్పించాలి. ఈ ముఖ్యమైన గడువును కోల్పోవడం వల్ల వారి చిన్న పొదుపు పెట్టుబడులు స్తంభింపజేస్తారని నిపుణులు పేర్కొంటున్నారు.

Small Saving Schemes: చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు షాక్‌.. ఈ నెలఖరులోపు ఆ పని చేయకపోతే మీ అకౌంట్‌ క్లాజ్‌..?
Follow us on

భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది సొమ్మును పొదుపు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నెలవారీ జీతంతో బతికే వేతన జీవులు తమ కలలను నెరవేర్చుకోవడానికి నెలానెలా జీతం సొమ్ములో నుంచి కొంత భాగాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. కాబట్టి భారతదేశంలో చిన్న మొత్తాలతో నిర్వహించే పొదుపు ఖాతాలకు డిమాండ్‌ ఏర్పడింది. ముఖ్యంగా చాలా మంది పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన పోస్టాఫీసు అకౌంట్స్‌లో సొమ్మును పొదుపు చేస్తూ ఉంటారు. అయితే పబ్లిక్ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), పోస్టాఫీసు డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు పథకాల పెట్టుబడిదారులు తమ ఆధార్ నంబర్‌ను పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖకు సమర్పించాలి. ఈ ముఖ్యమైన గడువును కోల్పోవడం వల్ల వారి చిన్న పొదుపు పెట్టుబడులు స్తంభింపజేస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌వై, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి పాన్‌, ఆధార్ నంబర్ తప్పనిసరి చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి 31 మార్చి 2023న నోటిఫికేషన్ జారీ చేసింది. 

సెప్టెంబర్ 30తో ఖాతాలు క్లోజ్‌?

ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ ప్రకారం చిన్న పొదుపు చందాదారులు పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌వై, ఎన్‌ఎస్సీ, ఎస్‌సీఎస్‌ఎస్‌ మరేదైనా చిన్న పొదుపు ఖాతాను తెరిచేటప్పుడు తమ ఆధార్ నంబర్‌ను సమర్పించాలి. లేకపోతే 30 సెప్టెంబర్ 2023 నుంచి  ఆధార్ నంబర్‌ను సీడింగ్ చేయని పక్షంలో వారి ఖాతా 1 అక్టోబర్ 2023 నుంచి స్తంభింపజేస్తారు. 

చిన్న పొదుపు ఖాతాలు అంటే? 

చిన్న పొదుపు పథకాలు వ్యక్తులు సంపదను ఆదా చేయడానికి. కూడబెట్టుకోవడానికి అనుమతించే పెట్టుబడి మార్గాలు. ఇవి ప్రభుత్వ-మద్దతు ఉన్న పథకాలు. అందువల్ల తక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి. ఈ పథకాలలో చాలా వరకు మీ పెట్టుబడి పన్ను ప్రయోజనాలకు అర్హత పొందుతాయి. అర్హత కలిగిన కొన్ని సాధారణ పథకాలు అంటే ఎస్‌సీఎస్‌ఎస్‌, పీపీఎఫ్‌ లాంటి పథకాలు. వీటిల్లో పెట్టుబడి పెడితే మీరు ఐటీ చట్టంలోని సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు ప్రయోజనాలను పొందుతారు. ప్రభుత్వం కూడా ప్రతి త్రైమాసికంలో రేటును సమీక్షిస్తుంది. జూలై-సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు 30 బీపీఎస్‌ వరకూ పెంచారు. ఈ వడ్డీ రేట్లు ముఖ్యంగా 1 సంవత్సరం, 2 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు, ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ల కోసం ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి