Airbags: కారు ప్రయాణం ఇక మరింత సురక్షితం.. కేంద్రం కీలక ప్రకటన.. కొత్త నియమ, నిబంధనలు.. ఎప్పటి నుంచి అంటే..

|

Mar 27, 2022 | 6:35 PM

Airbags: రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వినియోగదారులకు కీలక సందేశం ఇచ్చారు. కారు ప్రయాణం ఇప్పుడు మరింత సురక్షితం కానుంది. ఇప్పుడు..

Airbags: కారు ప్రయాణం ఇక మరింత సురక్షితం.. కేంద్రం కీలక ప్రకటన.. కొత్త నియమ, నిబంధనలు.. ఎప్పటి నుంచి అంటే..
Follow us on

Airbags: రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వినియోగదారులకు కీలక సందేశం ఇచ్చారు. కారు ప్రయాణం ఇప్పుడు మరింత సురక్షితం కానుంది. ఇప్పుడు 8 సీట్ల కార్లతో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం తప్పనిసరి. రహదారి భద్రత (Road safety)కు సంబంధించిన ఈ నియమం అక్టోబర్ 1, 2022 నుండి అమలులోకి వస్తుందని మంత్రి నితిన్‌ గడ్కారీ ( Nitin Gadkari) తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఎయిర్‌ బ్యాగ్స్‌ల సంఖ్య పెంచడంతో కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతాయి. భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం భారతదేశంలో ముఖ్యమైనది. ఇది పెద్ద కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వాహనాలు ఉండనున్నాయి. ఇలా ఎయిర్‌బ్యాగ్స్‌ అన్ని సీట్లకు ఉండటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్నవారంత సురక్షితంగా బయటపడవచ్చు. 8 సీట్ల వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనకు ఇటీవల ఆమోదం లభించింది. అన్ని ప్యాసింజర్ వాహనాలకు కనీసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే తప్పనిసరి చేసింది.

డ్రైవర్‌కు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి చేస్తూ జూలై 2019 నుండి అమలు చేయబడింది. అయితే జనవరి 1, 2022 నుండి ముందు సీట్లో కూర్చున్న ప్రయాణీకులకు ఇది తప్పనిసరి చేయబడింది. ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడం, పక్కపక్కనే ఢీకొనడం వంటి వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయాణికులను సురక్షితంగా ఉంచేందుకు వాహనాల్లో మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసింది కేంద్ర రవాణా శాఖ.

వెనుక సీట్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, రెండు ట్యూబ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం వల్ల ప్రయాణికులందరికీ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. భారతదేశంలో కారు ప్రయాణాన్ని సురక్షితంగా మార్చే దిశగా ఇదొక ముందడుగు అని గడ్కరీ అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2020లో హైవేపై మొత్తం 1.16 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఇందులో 47,984 మంది మరణించారు.

కార్ల ధరలు పెరుగుతాయా?

ఎయిర్‌బ్యాగ్‌ల వల్ల కార్ల ధరలు రూ.4,000 వరకు పెంచవచ్చు అంచనా ఉంది. కార్ల తయారీదారులు కారులోనే మరిన్ని ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చుకోవచ్చు. ఇలా చేయాలనుకుంటే మళ్లీ రీప్లేస్ చేయాలనుకుంటే కారు ధర రూ.50,000 పెరగవచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి:

Aadhaar History: మీ ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవాలా..? ఇలా చేయండి..!

Digilocker: డీజిలాకర్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ను జోడించడం ఎలా..? దీని వల్ల ఉపయోగం ఏమిటి?

CNG: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఆ రాష్ట్రంలో CNG ధర తగ్గింపు..!