Gold: 22 క్యారెట్లు vs 24 క్యారెట్లు.. నగలు, పెట్టుబడికి ఏది కొంటే లాభం..? ఈ నిజాలు తప్పక తెలుసుకోండి..

పండుగలైనా, శుభకార్యాలైనా బంగారం కొనాల్సిందే.. భారతీయులకు బంగారం అంటే ఓ స్పెషల్ సెంటిమెంట్. భవిష్యత్తుకు ఆర్థిక భరోసారి బంగారాన్ని చూస్తారు. అయితే జ్యువెలరీ షాపులోకి అడుగుపెట్టగానే చాలామందికి ఒక పెద్ద గందరగోళం ఎదురవుతుంది. "22 క్యారెట్ల బంగారం కొనాలా? లేక 24 క్యారెట్ల బంగారం తీసుకోవాలా? అనే సందేహం తలెత్తుతుంది. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఏది కొంటే లాభం, దేనివల్ల నష్టం కలుగుతుందో తెలుసుకుందాం.

Gold: 22 క్యారెట్లు vs 24 క్యారెట్లు.. నగలు, పెట్టుబడికి ఏది కొంటే లాభం..? ఈ నిజాలు తప్పక తెలుసుకోండి..
22 Carat Vs 24 Carat Gold

Updated on: Nov 19, 2026 | 2:46 PM

పండుగ సీజన్ అయినా, పెళ్లిళ్ల వేళ అయినా.. లేదా భవిష్యత్తు కోసం సురక్షితమైన పెట్టుబడి పెట్టాలన్నా భారతీయులకు బంగారమే ఫస్ట్ ఛాయిస్. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. కానీ నగల దుకాణంలోకి అడుగుపెట్టగానే చాలామందికి ఒక పెద్ద సందేహం వస్తుంది. 22 క్యారెట్ల బంగారం కొనాలా? లేక 24 క్యారెట్ల బంగారం కొనాలా? అనే గందరగోళం తలెత్తుతుంది. ఈ రెండింటిలో ఏది లాభదాయకం, దేనివల్ల నష్టం కలుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 24 క్యారెట్లు అంటే అచ్చమైన బంగారం అని అర్థం. గని నుండి వెలికితీసిన తర్వాత దీనిని 100 శాతం శుద్ధి చేయడం సాధ్యం కాదు కాబట్టి దీనిని 99.9 శాతం స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. ఇందులో రాగి, వెండి వంటి ఇతర లోహాలు ఏవీ కలపరు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తుంది.

24 క్యారెట్లతో ఆభరణాలు ఎందుకు చేయరు..?

స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం సహజంగా చాలా మెత్తగా ఉంటుంది. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నా, దీంతో నెక్లెస్‌లు, గాజులు వంటి ఆభరణాలు తయారు చేయడం అస్సలు సాధ్యం కాదు. ఒకవేళ చేసినా, చిన్నపాటి ఒత్తిడి తగిలినా ఆ నగలు సులభంగా వంగిపోతాయి లేదా తెగిపోతాయి.

22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత)

ఆభరణాల తయారీలో ఎదురైన ఈ సమస్యకు పరిష్కారమే 22 క్యారెట్ల బంగారం. ఇందులో 22 భాగాల స్వచ్ఛమైన బంగారానికి, 2 భాగాల రాగి, జింక్ లేదా వెండి వంటి కఠినమైన లోహాలను కలుపుతారు. అంటే ఇందులో 91.6 శాతం అసలైన బంగారం ఉంటుంది. మిశ్రమలోహం కలవడం వల్ల బంగారానికి మంచి గట్టిదనం వస్తుంది. రోజూ వాడే గొలుసులైనా, బరువైన పెళ్లి నగలైనా 22 క్యారెట్లతోనే తయారు చేస్తారు. ఇవి త్వరగా వంగిపోవు, రంగు కూడా మారవు. బంగారం శాతం కాస్త తక్కువగా ఉండటం వల్ల 24 క్యారెట్లతో పోలిస్తే దీని ధర తక్కువగా ఉంటుంది.

మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలి?

బంగారం కొనేముందు మీ అవసరం ఏంటో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీ లక్ష్యం కేవలం భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం, పెట్టుబడి పెట్టడం అయితే 24 క్యారెట్ల బంగారు నాణేలు లేదా బిస్కెట్లు కొని లాకర్‌లో భద్రపరుచుకోవడం ఉత్తమం. మీరు నగలు చేయించుకుని ధరించాలనుకుంటే 22 క్యారెట్ల బంగారమే సరైన ఎంపిక. మీ అవసరాన్ని బట్టి ముందే ఒక స్పష్టతతో దుకాణానికి వెళితే, బంగారు మార్కెట్‌లో ఎవరూ మిమ్మల్ని మోసం చేయలేరు.

Loading...
Unable to load recommendations.
Follow Us