Gold: వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే..

మా రోజుల్లో నెలకు రూ.25 జీతం వస్తే.. దాంతోనే హ్యాపీగా ఉంగరం చేయించుకున్నాం" అని ఇంట్లో పెద్దవాళ్లు చెప్తుంటే మనకు నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు తులం బంగారం లక్ష దాటింది. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటేనే ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితులు వచ్చాయి. అసలు 1960లలో బంగారం ధర ఎంత ఉండేది..? ఇప్పుడు ఇంత ఎలా పెరిగింది అనేది తెలుసుకుందాం..

Gold: వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే..
The Surprising Journey Of Gold Prices In India

Updated on: Jun 13, 2026 | 9:13 AM

బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది కోట్లాది మంది నమ్మకం, ఒక సెంటిమెంట్. రోజురోజుకూ దీని విలువ పెరుగుతుందని అందరికీ తెలిసినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో చూస్తున్న గరిష్ఠ ధరలను ప్రపంచం మునుపెన్నడూ చూడలేదు. ఒకప్పుడు పదుల్లో ఉన్న ఒక 8 గ్రాములు బంగారం ధర, వందలు, వేలు దాటుకుంటూ వచ్చి ఇప్పుడు ఏకంగా లక్షలు దాటేస్తుందని మనలో ఎవరూ ఊహించలేదు. దీని ప్రాధాన్యతను బట్టి అంతర్జాతీయ మార్కెట్‌లో రోజుకు రెండుసార్లు ధరను నిర్ణయించే ఆచారం శతాబ్దాలుగా సాగుతోంది. తెలుగు సంస్కృతిలో పెళ్లి అంటేనే పుస్తెల తాడు. ఎంత లేదన్నా కనీసం తులం లేదా అరతులం బంగారంతోనైనా తాళిబొట్టు చేయించడం ఇక్కడి సెంటిమెంట్. కానీ ఇప్పుడు గ్రాము ధరనే రూ.14 వేలు దాటడంతో తులం బంగారం కొనాలంటేనే లక్షన్నర వరకు చేతిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి కోసం తులాల లెక్కన బంగారం కొన్న తల్లిదండ్రులు, ఇప్పుడు గ్రాముల లెక్కన కొనడానికి కూడా బడ్జెట్ సరిపోక తలలుపట్టుకుంటున్నారు.

సామాన్యుడికి అందని ద్రాక్ష..

బంగారం ధరలు ఈ స్థాయిలో రెక్కలు రావడానికి కేవలం ఆభరణాల పిచ్చి మాత్రమే కారణం కాదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల చాలా దేశాలు, వాటి ప్రధాన సెంట్రల్ బ్యాంకులు తమ కరెన్సీ కంటే బంగారు నిల్వలను పెంచుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. అంతేకాకుండా షేర్ మార్కెట్ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉండటంతో, సామాన్యుడి నుండి పెద్ద ఇన్వెస్టర్ల వరకు అందరూ గోల్డ్‌పైనే పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక రకంగా బంగారం ఈరోజు సామాన్యుడికి ఒక కలగా మారుతోంది. నిత్యజీవితానికి దూరం జరుగుతోంది. ప్రస్తుతం ఒక్క తులం బంగారం ఉన్న వ్యక్తిని కూడా మనం లక్షాధికారి అని అనొచ్చు.

ఆ రోజుల్లో నెలకు రూ.25 జీతం..

శనివారం 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.14,859 గా ఉంది. ఈ ధర విన్న మన ఇళ్లల్లో ఉండే పెద్దలు మా కాలంలో బంగారం చాలా చీప్ అని అనడం మనం వింటూనే ఉంటాం. 1960లలో చిన్నపాటి ఉద్యోగానికి వెళ్లి, నెల మొత్తం కష్టపడితే కేవలం రూ.25 రూపాయల జీతం వచ్చేది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ 25 రూపాయలకే అప్పట్లో 2 నుంచి గ్రాముల బంగారం వచ్చేది.

8 గ్రాములు రూ.94

మీకు కూడా 8 గ్రాముల బంగారం కేవలం రూ.94 రూపాయలకే కావాలా? అయితే మీరు కొనవచ్చు.. కానీ, దానికోసం మనం కాల యంత్రం ఎక్కి సరిగ్గా ఒక 65 సంవత్సరాల వెనక్కి అంటే 1960వ దశకంలోకి వెళ్ళాలి. అవును, నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం.. ఆనాటి వార్తాపత్రికల ప్రకటనలు చూస్తే 8 గ్రాముల బంగారం ధర కేవలం రూ.94 రూపాయలుగానే నమోదైంది. రూ.94 రూపాయల నుండి ఈరోజు లక్ష దాటేసిన పసిడి ప్రయాణాన్ని చూస్తుంటే, కాలం ఎంత వేగంగా మారిందో, రూపాయి విలువ ఎంతగా పడిపోయిందో, బంగారానికి ఉన్న డిమాండ్ ఎంతలా పెరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది.

Follow Us