చంద్రబాబు జమానాలో జరిగిందిదే.. సర్వం వెల్లడించిన బుగ్గన

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఏపీలో ఏం జరిగిందో ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు హయాంలో జరిగిన బాగోతాలన్ని మీడియాకు వెల్లడించేశారు. చంద్రబాబు మొదట్నించి చెప్పేదొకటి.. చేసేదొకటి అంటూ నిప్పులు వెళ్ళగక్కారు బుగ్గన. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో అనేక బిల్లులు పెండింగ్‌లో పెట్టారని బుగ్గన ఆరోపించారు. పసుపు కుంకుమ పేరిట విద్యుత్ డిపార్ట్‌మెంట్ నుండి డబ్బులు వాడుకున్నారని చెప్పారు. దాదాపు 60 […]

చంద్రబాబు జమానాలో జరిగిందిదే.. సర్వం వెల్లడించిన బుగ్గన
Follow us

|

Updated on: Feb 06, 2020 | 2:29 PM

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఏపీలో ఏం జరిగిందో ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు హయాంలో జరిగిన బాగోతాలన్ని మీడియాకు వెల్లడించేశారు. చంద్రబాబు మొదట్నించి చెప్పేదొకటి.. చేసేదొకటి అంటూ నిప్పులు వెళ్ళగక్కారు బుగ్గన.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో అనేక బిల్లులు పెండింగ్‌లో పెట్టారని బుగ్గన ఆరోపించారు. పసుపు కుంకుమ పేరిట విద్యుత్ డిపార్ట్‌మెంట్ నుండి డబ్బులు వాడుకున్నారని చెప్పారు. దాదాపు 60 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టారని వివరించారు బుగ్గన. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది కాబట్టే రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని, గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా చూపించిన విధంగా రెవిన్యూ సాధించలేదని బుగ్గన అంటున్నారు.

2014లో రాష్ట్రానికి లక్షా 23 వేల కోట్లు రాష్ట్రానికి అప్పు వుండేదని, దాన్ని చంద్రబాబు 2019 కల్లా రెండు లక్షల 58 వేల కోట్ల అప్పుదాకా తీసుకువెళ్ళారని వివరించారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తమ ప్రభుత్వం గత ఎనిమిది నెలల్లో కేవలం 36 వేల కోట్లు అప్పు చేసిందని, అందులోను 7 వేల కోట్లు టిడిపి హయాంలో కమిటైనవేనని అన్నారాయన. ఎలక్షన్ సమయంలో ఒకే రోజున 5 వేల కోట్లు అప్పు తెచ్చారని చెప్పారు బుగ్గన. చంద్రన్న కానుక అప్పులు కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీరుస్తుందని బుగ్గన అంటున్నారు.

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక