దేశ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసే ఎలాంటి చ‌ర్యనైనా సహించేదిలేదు.. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి..

|

Jan 29, 2021 | 2:25 PM

తొలిరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో గ‌ల్వాన్ లోయ‌లో గ‌త ఏడాది చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త జ‌వాన్‌లు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యాన్ని..

దేశ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసే ఎలాంటి చ‌ర్యనైనా సహించేదిలేదు.. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి..
Follow us on

తొలిరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో గ‌ల్వాన్ లోయ‌లో గ‌త ఏడాది చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త జ‌వాన్‌లు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యాన్ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ గుర్తుచేశారు.

గ‌త ఏడాది జూన్‌లో గ‌ల్వాన్ లోయ‌లో దేశ ర‌క్ష‌ణ కోసం 20 మంది భార‌త జ‌వాన్‌లు చేసిన ప్రాణ త్యాగం ఎన్న‌టికీ మ‌రువ‌లేనిద‌ని అన్నారు. దేశం కోసం ప్రాణాల‌ర్పించిన ఆ 20 మంది సైనికుల‌ప‌ట్ల‌ దేశంలోని ప్ర‌తి పౌరుడు కృత‌జ్ఞ‌త భావం క‌లిగి ఉన్నార‌ని రాష్ట్ర‌ప‌తి పేర్కొన్నారు.

దేశ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసే ఎలాంటి చ‌ర్య‌నైనా త‌మ ప్ర‌భుత్వం స‌హించ‌బోద‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ స్ప‌ష్టం చేశారు. జాతి ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉన్న‌ద‌ని పునరుద్ఘాటించారు. భార‌తదేశ సౌర్వ‌భౌమ‌త్వాన్ని కాపాడ‌టం కోసం వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహరించామ‌ని రాష్ట్ర‌ప‌తి తెలిపారు.