అవును.. నేను బైసెక్సువల్

| Edited By:

Mar 01, 2019 | 1:58 PM

తన వ్యాఖ్య చాతుర్యత, కామెడీ టైమింగ్‌తో యూట్యూబ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా పేరొందిన లిల్లీసింగ్ అలియాస్ సూపర్‌ ఉమన్ తాను బైసెక్సువల్ అన్న విషయాన్ని బహిర్గతపరిచింది. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిన ఈ కెనడియన్ కమెడియన్.. తన వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టింది. అమ్మాయి, కలర్, బైసెక్సువల్ అనే మూడు బాక్స్‌లకు టిక్ పెట్టిన లిల్లీ సింగ్.. ‘‘వీటి వలన నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ ఇప్పుడు అవే నాకు శక్తులుగా […]

అవును.. నేను బైసెక్సువల్
Follow us on

తన వ్యాఖ్య చాతుర్యత, కామెడీ టైమింగ్‌తో యూట్యూబ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా పేరొందిన లిల్లీసింగ్ అలియాస్ సూపర్‌ ఉమన్ తాను బైసెక్సువల్ అన్న విషయాన్ని బహిర్గతపరిచింది. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిన ఈ కెనడియన్ కమెడియన్.. తన వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టింది.

అమ్మాయి, కలర్, బైసెక్సువల్ అనే మూడు బాక్స్‌లకు టిక్ పెట్టిన లిల్లీ సింగ్.. ‘‘వీటి వలన నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ ఇప్పుడు అవే నాకు శక్తులుగా మారాయి’’ అంటూ కామెంట్ పెట్టింది. దీనిపై ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బై సెక్సువల్ అన్న విషయాన్ని బయటపెట్టిన ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.


దక్షిణాసియాలో చాలా మంది తమ లైంగికత్వం గురించి మాట్లాడేందుకు భయపడుతుంటారని, కానీ లిల్లీ ధైర్యంగా చెప్పిందంటూ రచయిత ఆఫ్సన్ డిసౌజా లోథి చెప్పారు. ‘‘మా తల్లిదండ్రులు సూపర్‌ఉమన్ వీడియోలు చూస్తుంటారు. వారు ఆ వీడియోలు చూడటానికి నేనే కారణం. ఆ వీడియోలు చూస్తూ వారు చాలా ఎంటర్‌టైన్ అవుతారు. ఆమె వలన నా తల్లిదండ్రులతో బైసెక్సువలిటీ గురించి మాట్లాడే అవకాశం వచ్చింది’’ అంటూ డిసౌజా లోథి తెలిపారు. మరోవైపు స్వలింగ సంపర్కులు కూడా లిల్లీ సింగ్‌ ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. కాగా తనకు మద్దతు ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ లిల్లీ మరో ట్వీట్ చేసింది.