పోటీపడుతున్న జనం.. దండిగా ఆదాయం

అనధికార లే అవుట్లకు చెక్‌ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం వరంగల్ జిల్లాలోనూ సత్ఫలితాలిస్తోంది. 2015 లో ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌తో బల్దియాకు రూ. 199.50 కోట్లు ఆదాయం రాగా, ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనధికారిక లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఈ స్కీం ద్వారా క్రమబద్ధీకరించుకోవాలని అధికార యంత్రాంగం కోరుతోంది. అక్టోబర్‌ 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని.. […]

పోటీపడుతున్న జనం.. దండిగా ఆదాయం
Follow us

|

Updated on: Sep 24, 2020 | 12:31 PM

అనధికార లే అవుట్లకు చెక్‌ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం వరంగల్ జిల్లాలోనూ సత్ఫలితాలిస్తోంది. 2015 లో ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌తో బల్దియాకు రూ. 199.50 కోట్లు ఆదాయం రాగా, ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనధికారిక లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఈ స్కీం ద్వారా క్రమబద్ధీకరించుకోవాలని అధికార యంత్రాంగం కోరుతోంది. అక్టోబర్‌ 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని.. క్రమబద్ధీకరణ ఫీజును 2021 జనవరి 31 వరకు చెల్లించొచ్చని అధికారులు తెలిపారు. అయితే, ప్రభుత్వ భూములు, చెరువు శిఖం, దేవాదాయ భూముల్లో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించే అవకాశం లేదన్నారు.

ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్‌పై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు మంగళ, శనివారాల్లో కార్పొరేషన్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుత మార్కెట్‌ విలువ కాకుండా రిజిస్ట్రేషన్‌ నాటి విలువ ప్రకారం భూముల క్రమబద్ధీకరణ చేస్తామని కొత్తగా తెచ్చిన జీవోలో పేర్కొన్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ. 1000, లే అవుట్‌ డెవలపర్స్‌ రూ. 10 వేలతో అక్టోబర్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై సందేహాల నివృత్తి కోసం 18004251980, 0870 2500781 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Latest Articles
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..