శ్రీలంక పౌరులపై జరిగిన దారుణమైన ఉగ్ర దాడులను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. బాధిత కుటుంబాలకు, లంక ప్రజలకు ఐరాస ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ఈ కష్ట సమయంలో లంక పౌరులు, నాయకులు అంతా ఒకటిగా ఉండి కష్టకాలంలో ఒకరికి ఒకరు సహకరించుకోవాలని కోరింది. కాగా ఈ ఉగ్రదాడుల్లో మృతులు సంఖ్య పెరుగుతూ పోతుంది. 190కి మృతులు సంఖ్య చేరగా..గాయపడ్డవారు 500పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలను ఇళ్లు వదిలి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
The @UN in #lka strongly condemns the horrific attacks carried out against civilians and worshipers in #SriLanka. Heartfelt condolences to the families, victims & the Gov & people of #lka. The UN in #lka urges all citizens, all leaders to stand united during these difficult times
— UN in Sri Lanka (@UNSriLanka) April 21, 2019