థాయ్ సైనికుని ఘాతుకం.. 21 మంది కాల్చివేత

| Edited By: Anil kumar poka

Feb 09, 2020 | 12:07 PM

థాయ్‌లాండ్‌లో జక్రపంత్ థోమా అనే సైనికుడు రెచ్చిపోయాడు. ఓ షాపింగ్ మాల్‌‌లోకి చొరబడి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 21 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. థాయ్ రాజధాని బ్యాంకాక్ కు సుమారు 150 మైళ్ళ దూరంలోని ఖోరత్  సిటీలో జరిగిందీ దారుణం.. తన పై అధికారులతో వఛ్చిన వివాదంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఇతగాడు.. ఈ మాల్ లోని వారిపై కాల్పులు జరిపాడు. అనేకమందిని బందీలుగా పట్టుకున్నాడు. థోమా చేసిన బీభత్సానికి అక్కడివారంతా భయభ్రాంతులతో పరుగులు తీశారు. […]

థాయ్ సైనికుని ఘాతుకం.. 21 మంది కాల్చివేత
Follow us on

థాయ్‌లాండ్‌లో జక్రపంత్ థోమా అనే సైనికుడు రెచ్చిపోయాడు. ఓ షాపింగ్ మాల్‌‌లోకి చొరబడి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 21 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. థాయ్ రాజధాని బ్యాంకాక్ కు సుమారు 150 మైళ్ళ దూరంలోని ఖోరత్  సిటీలో జరిగిందీ దారుణం.. తన పై అధికారులతో వఛ్చిన వివాదంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఇతగాడు.. ఈ మాల్ లోని వారిపై కాల్పులు జరిపాడు. అనేకమందిని బందీలుగా పట్టుకున్నాడు. థోమా చేసిన బీభత్సానికి అక్కడివారంతా భయభ్రాంతులతో పరుగులు తీశారు. తన నిర్వాకాన్ని ఇతగాడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. కాగా.. ఇతడిని ఆ తరువాత అతి కష్టం మీద భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఇతని కాల్పుల్లో ఓ సైనికాధికారి కూడా ప్రాణాలు కోల్పోయాడని తెలిసింది.