పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న తెలుగు వారు

| Edited By:

Apr 21, 2019 | 6:14 PM

పవిత్ర ఈస్టర్‌ వేళ శ్రీలంకలోని పలు చర్చిలు, హోటళ్లను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు పేలుళ్లతో ముష్కరులు జరిపిన మారణకాండ నుంచి అనంతపురం జిల్లా వాసులు తృటిలో బయటపడ్డారు. ఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్‌ అధినేత అమిలినేని సురేంద్ర బాబు నలుగురు స్నేహితులతో కలిసి కొలంబోకు విహార యాత్రకు వెళ్లారు. కొలంబోలోని షంగ్రీలా హోటల్‌లో అల్పాహారం తీసుకుంటున్న సమయంలో అక్కడ బాంబు పేలుడు జరిగింది. పరిస్థితి వివరించి ఎవరూ ఆందోళన చెందవద్దని మైక్‌ద్వారా అక్కడి సిబ్బంది చెప్పడంతో అంతా భయాందోళనలతో […]

పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న తెలుగు వారు
Follow us on

పవిత్ర ఈస్టర్‌ వేళ శ్రీలంకలోని పలు చర్చిలు, హోటళ్లను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు పేలుళ్లతో ముష్కరులు జరిపిన మారణకాండ నుంచి అనంతపురం జిల్లా వాసులు తృటిలో బయటపడ్డారు. ఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్‌ అధినేత అమిలినేని సురేంద్ర బాబు నలుగురు స్నేహితులతో కలిసి కొలంబోకు విహార యాత్రకు వెళ్లారు. కొలంబోలోని షంగ్రీలా హోటల్‌లో అల్పాహారం తీసుకుంటున్న సమయంలో అక్కడ బాంబు పేలుడు జరిగింది. పరిస్థితి వివరించి ఎవరూ ఆందోళన చెందవద్దని మైక్‌ద్వారా అక్కడి సిబ్బంది చెప్పడంతో అంతా భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.

ఈ ఘటనపై ఎస్పీ అశోక్‌ స్పందించారు. ప్రస్తుతం శ్రీలంకలో సెల్‌ టవర్లు పనిచేయకపోవడంతో వారిని సంప్రదించే వీలు కలగడంలేదని చెప్పారు. వీళ్లంతా ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలోనే ఉన్నట్టు సమాచారం. అయితే, వారికి సంబంధించిన పాస్‌పోర్టులు, ఇతర పత్రాలన్నీ హోటల్‌లోనే ఉండిపోయాయి.