ఇవాళ, ఎల్లుండి TS.Ed.CET-2020 ఎగ్జామ్

|

Oct 01, 2020 | 9:31 AM

తెలంగాణలో బి.ఎడ్ రెండు సంవత్సరాల కోర్సులో ప్రవేశాల కోసం జరిగే TS.Ed.CET-2020కి సర్వం సిద్ధమైంది. నేడు (అక్టోబర్ 1), ఎల్లుండి (3వతేదీ) తేదీలలో ఈ పరీక్ష జరుగుతుంది. రాష్ట్రం మొత్తంగా 43,380 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. వీరిలో 10,339 మంది పురుషులు (24%) కాగా,33,041 మంది స్త్రీలు పరీక్ష రాయబోతున్నారు. ఉదయం గం. 10.00 నుండి మధ్యాహ్నం గం. 12.00 వరకు, మధ్యాహ్నం సెషన్ 3.00 నుండి సాయంత్రం 5.00 వరకు ఉంటుంది. అక్టోబర్1 […]

ఇవాళ, ఎల్లుండి TS.Ed.CET-2020 ఎగ్జామ్
Follow us on

తెలంగాణలో బి.ఎడ్ రెండు సంవత్సరాల కోర్సులో ప్రవేశాల కోసం జరిగే TS.Ed.CET-2020కి సర్వం సిద్ధమైంది. నేడు (అక్టోబర్ 1), ఎల్లుండి (3వతేదీ) తేదీలలో ఈ పరీక్ష జరుగుతుంది. రాష్ట్రం మొత్తంగా 43,380 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. వీరిలో 10,339 మంది పురుషులు (24%) కాగా,33,041 మంది స్త్రీలు పరీక్ష రాయబోతున్నారు. ఉదయం గం. 10.00 నుండి మధ్యాహ్నం గం. 12.00 వరకు, మధ్యాహ్నం సెషన్ 3.00 నుండి సాయంత్రం 5.00 వరకు ఉంటుంది. అక్టోబర్1 న, మధ్యాహ్నం 3 గంటల నుండి సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు.

మార్నింగ్ సెషన్‌లో మెథడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్ పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం సెషన్‌లో బయోలాజికల్ సైన్సెస్, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజెస్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రంకి చేరుకోవచ్చు. అయితే, పరీక్ష సమయానికి ఒక నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించరు. అభ్యర్థులు తమ సొంత మాస్క్‌ను తీసుకురావాలి. గ్లోవ్స్, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ ఇంకా, పారదర్శక వాటర్ బాటిల్ తీసుకుతెచ్చుకునే వీలుంది. పరీక్ష సజావుగా నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.