గారాల పట్టితో కలిసి డ్యాన్స్ చేసిన సెరినా

|

Jun 13, 2020 | 7:49 PM

లాక్ డౌన్ కారణంగా ప్రపంచం మొత్తం ఇంటికే పరమితమైంది. అన్ని రంగాల ప్రముఖులు కేవలం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ తన చిన్నారితో తెగ ఎంజాయి చేస్తోంది. ఇంట్లో చిన్నారితో ఆడుతూ పాడుతూ ఫుల్ జోష్ లో లాక్ డౌన్ ను గడిపేస్తోంది. తన ముద్దుల కూతురు అలెక్సిస్ ఒలింపియా ఓహానియన్ తో ఓ పాటకు స్టెప్పులు వేశారు. తల్లీకూతుళ్లు ఒకే రకం డ్రెస్‌ ధరించి ఇళ్లంతా తిరుగుతూ […]

గారాల పట్టితో కలిసి డ్యాన్స్ చేసిన సెరినా
Follow us on

లాక్ డౌన్ కారణంగా ప్రపంచం మొత్తం ఇంటికే పరమితమైంది. అన్ని రంగాల ప్రముఖులు కేవలం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ తన చిన్నారితో తెగ ఎంజాయి చేస్తోంది. ఇంట్లో చిన్నారితో ఆడుతూ పాడుతూ ఫుల్ జోష్ లో లాక్ డౌన్ ను గడిపేస్తోంది. తన ముద్దుల కూతురు అలెక్సిస్ ఒలింపియా ఓహానియన్ తో ఓ పాటకు స్టెప్పులు వేశారు. తల్లీకూతుళ్లు ఒకే రకం డ్రెస్‌ ధరించి ఇళ్లంతా తిరుగుతూ సందడి చేశారు. సెరెనా డాన్స్‌ చేస్తుంటే.. అలెక్సిస్‌ తల్లిని అనుసరించింది. ఆ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోకు సెరెనా ‘కీపింగ్‌ బిజీ’ అని కామెంట్‌ను జత చేశారు. ఈ డాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సెరెనా హోం క్వారంటైన్‌కి పరిమితమై తన గారాలపట్టితో సరదాగా గడుపుతున్నారు.