నమ్మలేకపోతున్నా : రామ్ చరణ్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. నమ్మలేకున్నా.. అప్పుడే 13 ఏళ్లు నిండిపోయాయి. అంటూ తన తెరంగేట్రం గురించి గుర్తు చేసుకున్నారు. తన సినిమా జర్నీలో ఎన్నో ఎత్తులు చూశా.. ఇందులో కొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రతీ ఘట్టాన్ని ఆస్వాదించా. ఎల్లప్పుడూ తనను ఆదరిస్తూనే ఉన్న అభిమానులకు నా ధన్యవాదాలు. మీకోసం మరింత కష్టపడి పనిచేస్తానని వినయపూర్వకంగా మాటిస్తున్నా అంటూ ఫ్యాన్స్ కు సందేశమిచ్చారు చరణ్ . కాగా, […]

నమ్మలేకపోతున్నా : రామ్ చరణ్

Updated on: Sep 28, 2020 | 12:07 PM

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. నమ్మలేకున్నా.. అప్పుడే 13 ఏళ్లు నిండిపోయాయి. అంటూ తన తెరంగేట్రం గురించి గుర్తు చేసుకున్నారు. తన సినిమా జర్నీలో ఎన్నో ఎత్తులు చూశా.. ఇందులో కొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రతీ ఘట్టాన్ని ఆస్వాదించా. ఎల్లప్పుడూ తనను ఆదరిస్తూనే ఉన్న అభిమానులకు నా ధన్యవాదాలు. మీకోసం మరింత కష్టపడి పనిచేస్తానని వినయపూర్వకంగా మాటిస్తున్నా అంటూ ఫ్యాన్స్ కు సందేశమిచ్చారు చరణ్ .

కాగా, రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘చిరుత’ సినిమా 13ఏళ్ల క్రితం అంటే, 2007వ సంవత్సరం సరిగ్గా ఇదేరోజు(సెప్టెంబర్ 28)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆ సినిమాకి పనిచేసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాణసంస్థ వైజయంతీ మూవీస్, సంగీత దర్శకుడు మణిశర్మకు చరణ్ ధన్యవాదాలు చెప్పారు. ‘చిరుత’ సినిమా షూటింగ్ ఘట్టమంతా నిన్నే జరిగినట్టు తనకళ్ల ముందు కదలాడుతుందని చరణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పూరీ జగన్నాథ్ కు తన శుభాకాంక్షలు తెలియజేశాడు రామ్ చరణ్.

Loading...
Unable to load recommendations.
Follow Us