‘పుష్ప‌’ షూటింగ్ ఇలా చేస్తారట..

|

Jun 01, 2020 | 10:42 AM

pushpa shooting : స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా  వస్తున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌ ఇప్పటికే వైరల్‌గా మారింది. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్.. త్వరలో తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అయితే ఈ షూటింగ్ ఆగస్ట్ ‌నుంచి చేయాల‌నుకుంటున్నారు. అది కూడా ట్ర‌య‌ల్ అండ్ ఎర‌ర్ ప‌ద్ధ‌తిలో ముందుకు వెళ్లాలని నిర్ణయించార‌ట. నెల రోజుల పాటు ప‌రిమిత సంఖ్య‌లోని స‌భ్యుల‌తో షూటింగ్‌ను […]

‘పుష్ప‌’ షూటింగ్ ఇలా చేస్తారట..
Follow us on

pushpa shooting : స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా  వస్తున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌ ఇప్పటికే వైరల్‌గా మారింది. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్.. త్వరలో తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అయితే ఈ షూటింగ్ ఆగస్ట్ ‌నుంచి చేయాల‌నుకుంటున్నారు. అది కూడా ట్ర‌య‌ల్ అండ్ ఎర‌ర్ ప‌ద్ధ‌తిలో ముందుకు వెళ్లాలని నిర్ణయించార‌ట. నెల రోజుల పాటు ప‌రిమిత సంఖ్య‌లోని స‌భ్యుల‌తో షూటింగ్‌ను మొదలు పెట్టాలని అనుకుంటున్నార‌ట‌. షూటింగ్ జరుగుతున్న స‌మ‌యంలో స‌భ్యులంద‌రూ ఒకే ప్రాంతంలోనే ఉంటార‌ట‌. వారు ఇత‌రుల‌ను క‌ల‌వ‌డం.. ఇత‌రులు వారున్న ప్ర‌దేశానికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ను అనుస‌రించి త‌దుప‌రి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు.