మాజీ సీఎం పాదాలు తాకిన పీఎం మోడీ

గుజరాత్: మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కాళ్లకు ప్రధాని మోడీ మొక్కారు. సోమవారం నుంచి గుజరాత్‌లో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. అడలజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరువురు నాయకులు ఒకే స్టేజ్‌పైకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కేశూభాయ్ కాళ్లను మోడీ తాకారు. ప్రధానిని కలిసేందుకు పలువురు ఎదురు చూస్తున్న సమయంలో మోడీ ఇలా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.     కేశూభాయ్ గతంలో రెండు సార్లు గుజరాత్ సీఎంగా పని చేశారు. […]

మాజీ సీఎం పాదాలు తాకిన పీఎం మోడీ

Edited By:

Updated on: Mar 05, 2019 | 5:00 PM

గుజరాత్: మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కాళ్లకు ప్రధాని మోడీ మొక్కారు. సోమవారం నుంచి గుజరాత్‌లో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. అడలజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరువురు నాయకులు ఒకే స్టేజ్‌పైకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కేశూభాయ్ కాళ్లను మోడీ తాకారు. ప్రధానిని కలిసేందుకు పలువురు ఎదురు చూస్తున్న సమయంలో మోడీ ఇలా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

 

 

కేశూభాయ్ గతంలో రెండు సార్లు గుజరాత్ సీఎంగా పని చేశారు. 1995లో మార్చి నుంచి అక్టోబర్ వరకు, ఆ తర్వాత మార్చి 1998 నుంచి అక్టోబర్ 2001 వరకు సీఎంగా పని చేశారు. 2012లో బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలపై భారత వాయిసేన జరిపిన దాడి చివరిది కాదని, మరిన్న చర్యలు భారత ప్రభుత్వం చేయనుందని చెప్పారు.

Follow Us