
ఒకటి, రెండు సినిమాలు చేసి.. ఓవర్ యాక్షన్ డైలాగ్స్ వేసే హీరోలు ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువైపోయారు. కానీ బెల్లకొండ శ్రీనివాస్ అంత బ్యాగ్రౌండ్ ఉండి కూడా సైలెంట్ గా, సాదాసీదాగా తన పని చేసకుంటూ వెళ్తాడు. అంతేనా శ్రీనివాస్ రొమాన్స్ చేయని టాలీవుడ్ టాప్ హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఐటమ్ సాంగ్స్ కోసమైతే..అధిక మొత్తం అమౌంట్ ఇచ్చి మరీ టాప్ హీరోయిన్స్ తో స్టైప్పులేస్తాడు. తాజాగా ‘అల్లుడు అదుర్స్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు బెల్లకొండ.
ఈ మూవీ కోసం ఈ మధ్య కాలంలో గ్లామర్ తో పిచ్చెక్కిస్తోన్న నిధి అగర్వాల్ ను ఐటమ్ సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారట టీమ్. అయితే ఊహింరని విధంగా రూ. 60 లక్షలు డిమాండ్ చేసి షాక్ గురి చేసిందట ఇస్మార్ట్ భామ. ముచ్చటగా మూడు సినిమాలు చేసిన నిధి అంత అడిగేసరికి రెండో మాట కూడా లేకుండా మరో హీరోయిన్ ని వెతకడం ప్రారంభించిందట మూవీ టీమ్. పరిస్థితులు చూస్తుంటే కాస్త రేటు ఎక్కువైనా మరోసారి తమన్నానే ప్రిపర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన చివరి చిత్రం ‘సీత’ కోసం పాయల్ రాజ్‌పుత్‌ను ఎంచుకున్నాడు. మరి బెల్లంకొండవారబ్బాయి ఈ సారి ఏ భామవైపు మొగ్గు చూపుతాడో చూడాలి.