కొత్త మ్యాప్.. సవరణ బిల్లుకు నేపాల్ పార్లమెంట్ ఆమోదం

| Edited By: Pardhasaradhi Peri

Jun 13, 2020 | 6:05 PM

భారత్ కు చెందిన మూడు భూభాగాలను తమవిగా ప్రకటించుకుంటూ ఓ కొత్త మ్యాప్ లో వీటిని చేర్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును నేపాల్ పార్లమెంట్ శనివారం ఆమోదించింది. కాలాపానీ. లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలను..

కొత్త మ్యాప్.. సవరణ బిల్లుకు నేపాల్ పార్లమెంట్ ఆమోదం
Follow us on

భారత్ కు చెందిన మూడు భూభాగాలను తమవిగా ప్రకటించుకుంటూ ఓ కొత్త మ్యాప్ లో వీటిని చేర్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును నేపాల్ పార్లమెంట్ శనివారం ఆమోదించింది. కాలాపానీ. లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలను ఈ నూతన మ్యాప్ లో చేర్చారు. వివాదాస్పదమైన ఈ బిల్లుకు అనుకూలంగా 258 మంది సభ్యులు ఓటు వేశారు. (సభలో మొత్తం ఉన్న సభ్యుల సంఖ్య 275). నేపాల్ ప్రభుత్వ వైఖరిపై భారత్  ప్రకటించిన తీవ్ర వ్యతిరేకతను పట్టించుకోకుండా అక్కడి పార్లమెంట్ ఈ సవరణ బిల్లును ఆమోదించడం విశేషం. కొత్త మ్యాప్ ఆమోదానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలన్న ప్రతిపాదనకు  ఈ నెల 9 న  నేపాల్ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.