శుక్రుడిపై జీవం ఉండే అవకాశం ఉందా?

|

Sep 15, 2020 | 12:09 PM

అనంతానంత విశ్వంలో ఎక్కడో చోట భూమిని పోలిన గ్రహాలు ఉండి ఉంటాయన్నది శాస్ర్తవేత్తల గట్టి నమ్మకం.. మనలా బుద్ధిజీవులు కావచ్చు.. మనకంటే అపారమైన తెలివితేటలు కలిగినవారై ఉండవచ్చు.. లేదా జీవం ఆవిర్భావ దశలో ఉండినా ఉండవచ్చు.

శుక్రుడిపై జీవం ఉండే అవకాశం ఉందా?
Follow us on

అనంతానంత విశ్వంలో ఎక్కడో చోట భూమిని పోలిన గ్రహాలు ఉండి ఉంటాయన్నది శాస్ర్తవేత్తల గట్టి నమ్మకం.. మనలా బుద్ధిజీవులు కావచ్చు.. మనకంటే అపారమైన తెలివితేటలు కలిగినవారై ఉండవచ్చు.. లేదా జీవం ఆవిర్భావ దశలో ఉండినా ఉండవచ్చు. భూగోళంలాంటి గ్రహాలు ఉండటం మాత్రం ఖాయం.. ఆ ఆన్వేషణ అలా సాగుతూనే ఉంది.. మొన్నటి వరకు అంగాకర గ్రహం మీద నీటి జాడలున్నాయని, అక్కడ జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని అన్నారు.. చంద్రుడిపై కూడా నీటిజాడలు కనిపెట్టారు.. ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న శుక్రుడిపై జీవం ఉండే ఆస్కారం ఉందంటున్నారు సైంటిస్టులు.. బ్రిటన్‌లోని కార్డిఫ్‌ యూనివర్సిటీ పరిశోధలు ఈ విషయాన్ని చెప్పారు. సాధారణంగా ఆక్సిజన్‌ లేని ప్రాంతంలో నివసించే సూక్ష్మజీవులు ఫాస్పైన్‌ను విడుదల చేస్తాయి. శుక్రగ్రహంపై ఫాస్పైన్‌ ఉంది కాబట్టి సూక్ష్మజీవులు కూడా ఉండే ఉంటాయన్నది పరిశోధకుల విశ్వాసం . మొదట హవాయి ద్వీపంలోని జేమ్స్‌ క్లార్క్‌ మాక్స్‌వెల్‌ టెలిస్కోప్‌ సాయంతో శుక్రుడిపై సాస్పైన్‌ ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత చిలీలోని అటాకామా ఎడారిలోని టెలిస్కోప్‌లతో శుక్రగ్రహం ఉపరితం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని క్లౌడ్‌ డెక్‌ను పరిశీలించింది నిపుణుల బృందం. ఈ క్రమంలో వీరు ఫాస్ఫైన్‌‌ ఉనికిని గుర్తించారు. భూమి మీద ఇది సేంద్రీయ పదార్థాల విచ్ఛిన్నం నుంచి లభిస్తుంది. పాస్ఫైన్‌కు మండే స్వభావం ఉంటుంది.

అయితే, కొందరు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. పాస్ఫిన్‌ ఉన్నంత మాత్రాన జీవం ఉంటుందని చెప్పలేమంటున్నారు. ఈ సందర్భంగా కార్డిఫ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీకి చెందిన లీడ్ రచయిత జేన్ గ్రీవ్స్ అభిప్రాయం ఇది. కాకపోతే భూమి కాకుండా వేరే రాతి గ్రహం మీద ఫాస్ఫైన్ కనుగొనడం ఇదే మొదటిసారి అంటున్నారు గ్రీవ్స్. శుక్ర గ్రహం మీదే ఇంత ఆసక్తి ఎందుకంటే.. ఇది మనకు సమీపంగా ఉండటమే కాక.. పరిమాణంలో భూమికి సమానంగా ఉంటుంది. అంతేకాక గత అధ్యయనాలు ఇక్కడ చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయని లావా ప్రవాహాల సంకేతాలతో సహా గుర్తించాయి. అసలు శుక్రుడిపై జీవం ఉండటానికి ఆస్కారం లేదన్నది ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం. ఎందుకంటే అక్కడి వాతావరణంలో 96 శాతం కార్బన్‌ డయాక్సైడే ఉంటుంది. ఉపరితల ఉష్ణోగ్రతలు 400 డిగ్రీ సెంటిగ్రేడ్‌ కంటే ఎక్కువగా ఉంటాయి.. అంతెందుకు అక్కడ దిగిన స్పేస్‌ ప్రోబ్‌లు నిమిషాల్లోనే చెడిపోయాయి.. అలాంటప్పుడు అక్కడ జీవం ఉండే ఆస్కారం లేదంటున్నారు సైంటిస్టులు.