‘అర్థరాత్రి హుటాహుటిన హాస్పిటల్ కు…కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలు…’, ‘సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలు.. ఆస్పత్రిలో చేరిక’, ‘సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు కాలికి ఫ్రాక్చర్..’!…… ఇదీ వరస. ఈ రకంగా గత కొన్ని గంటలుగా కొన్ని వార్తా వెబ్ సైట్లు, పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. దీంతో కేటీఆర్ తనయుడు, సీఎం కేసీఆర్ మనువడు షిమాన్షు రావు డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సి వచ్చింది. తనకు ఏదో అయిపోయిందంటూ వస్తోన్న ఈ వార్తలన్నీ పచ్చి అబద్దాలు.. వట్టి పుకార్లు మాత్రమే అంటూ యంగ్ హిమాన్షు క్లారిటీ ఇచ్చాడు.
తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. తన కాలికి పెద్ద ఫ్రాక్ఛర్ అయిందంటూ వస్తున్న వార్తలను బుల్ షిట్ గా హిమాన్షు అభివర్ణించాడు. చిన్నగా కాలు బెణికిందని, అయితే, తాను నడవగలుగుతున్నానని వెల్లడించాడు. అంతేకాదు, రేపటినుంచి పరుగెడతా కూడా అంటూ నవ్వేశాడీ యంగ్ స్టార్. ఇకనైనా తన ఆరోగ్యంపై పుకార్లు పుట్టించే సాహసాలు ఆపండని కోరాడు. దయచేసి ఇటువంటి వెర్రి వార్తాపత్రికలను నమ్మవద్దని చెబుతూ ధన్యవాదాలు చెప్పాడు కల్వకుంట్ల హిమాన్షు రావు.
Don’t trust such silly news papers please. pic.twitter.com/eGMuGXwlkl
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) October 1, 2020