హరీశ్‍, కేటీఆర్ల మెజారిటీ సవాల్

బావా – బావమరుదులు సవాల్ విసురుకున్నారు. మెజార్టీ మాదంటే.. మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా మెదక్ పార్లమెంట్ సన్నాహక సభలో టీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌ల మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర అంశం. సభలో హరీశ్‍రావు మాట్లాడుతూ.. ‘‘బీజేపీ, కాంగ్రెస్‌లతో పోటీ లేదు. మనకు పోటీ కరీంనగర్, వరంగల్ పార్లమెంట్‌లతో ఉంది. మెజార్టీ ఎవరు తెస్తారన్నదే అసలు పోటీ. ప్రత్యర్థులు చేతులు ఎత్తేశారు. మనకు మనమే పోటీ. అత్యధిక మెజార్టీ తెచ్చి.. మెదక్ జిల్లా […]

హరీశ్‍, కేటీఆర్ల మెజారిటీ సవాల్

Updated on: Mar 08, 2019 | 3:10 PM

బావా – బావమరుదులు సవాల్ విసురుకున్నారు. మెజార్టీ మాదంటే.. మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా మెదక్ పార్లమెంట్ సన్నాహక సభలో టీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌ల మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర అంశం.

సభలో హరీశ్‍రావు మాట్లాడుతూ.. ‘‘బీజేపీ, కాంగ్రెస్‌లతో పోటీ లేదు. మనకు పోటీ కరీంనగర్, వరంగల్ పార్లమెంట్‌లతో ఉంది. మెజార్టీ ఎవరు తెస్తారన్నదే అసలు పోటీ. ప్రత్యర్థులు చేతులు ఎత్తేశారు. మనకు మనమే పోటీ. అత్యధిక మెజార్టీ తెచ్చి.. మెదక్ జిల్లా గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలి. కేసీఆర్‌కు బహుమానం ఇవ్వాలి’’ అన్నారు.

దీనిపై స్పందించిన కేటీఆర్.. తాను హరీశ్ రావుతో ఏకీభవిస్తున్నా అన్నారు. నేను కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా.. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేను సవాల్ చేస్తున్నా.. మా కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చి రుజువు చేసుకోవాలి. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాకంటే ఒక్క ఓటు అన్నా ఎక్కువ తెచ్చుకుని.. మేం ముందుంటాం. నిరూపించుకుంటాం అనగానే అక్కడున్న వారంతా హర్షధ్వానాలు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us