జయరామ్ హత్య కేసు.. ముగిసిన నిందితుల కస్టడీ

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నిందితుల కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. వైద్య పరీక్షల కోసం నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఆ తరువాత నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. అయితే ఎంత విచారించిన అసలు విషయాలు తేలకపోవడంతో నిందితులను మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో రాకేశ్ నోటికి వచ్చినట్లుగా సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు భావిస్తున్నారు. కొన్ని నిజాలే […]

జయరామ్ హత్య కేసు.. ముగిసిన నిందితుల కస్టడీ
Follow us

| Edited By:

Updated on: Feb 16, 2019 | 11:21 AM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నిందితుల కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. వైద్య పరీక్షల కోసం నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఆ తరువాత నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

అయితే ఎంత విచారించిన అసలు విషయాలు తేలకపోవడంతో నిందితులను మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో రాకేశ్ నోటికి వచ్చినట్లుగా సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు భావిస్తున్నారు. కొన్ని నిజాలే చెప్తూ.. ఎక్కువ అబద్ధాలు చెబుతున్నాడని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో వారిని మరో నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవాల్సిందిగా కోరాలని పోలీసులు నిర్ణయించారు.