కరీంనగర్‌ హిందూ జనజాగృతి సభకు హైకోర్టు అనుమతి

కరీంనగర్‌లో ఈరోజు నిర్వహించతలపెట్టిన హిందూ జనజాగృతి సమితి సభకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. చాలా రోజుల క్రితమే పోలీసులు ఈ సభకు అనుమతించినప్పటికీ మధ్యలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేరు చేర్చడంతో వివాదం నెలకొంది. తొలుత అనుమతి తీసుకున్నప్పుడు సభకు హాజరయ్యే వారి వివరాలను పోలీసులకు ఇచ్చారు. అందులో రాజాసింగ్‌ పేరు లేదు. తర్వాత సభ నిర్వహణకు ముందు ఇచ్చిన జాబితాలో రాజాసింగ్‌ పేరు చేర్చడంతో పోలీసులు అనుమతిచ్చేందుకు నిరాకరించారు. దీంతో […]

కరీంనగర్‌ హిందూ జనజాగృతి సభకు హైకోర్టు అనుమతి

Edited By:

Updated on: Mar 02, 2019 | 12:32 PM

కరీంనగర్‌లో ఈరోజు నిర్వహించతలపెట్టిన హిందూ జనజాగృతి సమితి సభకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. చాలా రోజుల క్రితమే పోలీసులు ఈ సభకు అనుమతించినప్పటికీ మధ్యలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేరు చేర్చడంతో వివాదం నెలకొంది. తొలుత అనుమతి తీసుకున్నప్పుడు సభకు హాజరయ్యే వారి వివరాలను పోలీసులకు ఇచ్చారు. అందులో రాజాసింగ్‌ పేరు లేదు.

తర్వాత సభ నిర్వహణకు ముందు ఇచ్చిన జాబితాలో రాజాసింగ్‌ పేరు చేర్చడంతో పోలీసులు అనుమతిచ్చేందుకు నిరాకరించారు. దీంతో నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ ను విచారించిన న్యాయమూర్తి.. రాజాసింగ్‌ అంశాన్ని ప్రస్తావించారు. ఆయనను ఆహ్వానించకుండానే సభ నిర్వహించుకుంటామని నిర్వాహకులు కోర్టుకు తెలియజేయడంతో హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.