ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎబోలా వ్యాధిపై ఎమర్జెన్సీని ప్రకటించింది. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి పెరిగినందున ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ కాంగోలోని గోమాకు విస్తరించిందంటూ కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించడంతో డబ్ల్యూహెచ్‌ఒ ఈ ప్రకటన చేసింది. మొదటిసారి 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ను గుర్తించినప్పుడు అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. గత ఏడాది మూడుసార్లు ఎబోలా వ్యాపించింది. అలాగే 2018 నుంచి ఇప్పటి వరకు 1800 మంది మరణించారు. పరిస్థితి దారుణంగా ఉండటంతో డబ్ల్యూ హెచ్ఓ ఈ ప్రకటన విడుదల చేసింది.