బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో 17 కి పెరిగిన మృతులు

|

Sep 22, 2020 | 10:44 AM

మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి పట్టణంలో మూడంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17 కి పెరిగింది. సహాయక చర్యలు చేపడుతోన్న ఎన్డీఆర్ఎఫ్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. శిధిలాల కింద పడి తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భవనంలో దాదాపు 20కి పైగా ఫ్లాట్లు ఉండగా.. తెల్లవారుజామున ప్రమాదం సంభవించడంతో మృతులు, గాయపడినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. భవనంలో నివసిస్తున్న […]

బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో 17 కి పెరిగిన మృతులు
Follow us on

మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి పట్టణంలో మూడంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17 కి పెరిగింది. సహాయక చర్యలు చేపడుతోన్న ఎన్డీఆర్ఎఫ్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. శిధిలాల కింద పడి తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భవనంలో దాదాపు 20కి పైగా ఫ్లాట్లు ఉండగా.. తెల్లవారుజామున ప్రమాదం సంభవించడంతో మృతులు, గాయపడినవారి సంఖ్య ఎక్కువగా ఉంది.

భవనంలో నివసిస్తున్న వారంతా గాఢ నిద్రలో ఉండగానే.. సోమవారం తెల్లవారుజూమున నాలుగు గంటల సమయంలో అకస్మాత్తుగా బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోయిన సంగతి తెలిసింది. ఈ ప్రమాదం సంభవించగానే.. స్థానికులు హుటాహుటిన 20 మందిని కాపాడారు. వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. భీవండీ పట్టణంలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో 1984లో ఈ భవనాన్ని నిర్మించారు. కాగా, ఆగస్టు 24న మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్‌లో భవనం కూలి దాదాపు 18 మంది వరకు మరణించారు.