వైసీపీలో చేరిన అలీ

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:51 PM

ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదారాబాద్ లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో అలీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అలీని జగన్ సాదరంగా తన పార్టీలోకి ఆహ్వానించారు. అయితే అలీ ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీల అధినేతలను కలిసిన అలీ, చివరికి వైసీపీ గూటికి చేరారు. టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్ ఆశించిన అలీకి హామీ రాకపోవడంతోనే […]

వైసీపీలో చేరిన అలీ
Follow us on

ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదారాబాద్ లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో అలీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అలీని జగన్ సాదరంగా తన పార్టీలోకి ఆహ్వానించారు. అయితే అలీ ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీల అధినేతలను కలిసిన అలీ, చివరికి వైసీపీ గూటికి చేరారు. టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్ ఆశించిన అలీకి హామీ రాకపోవడంతోనే సైకిల్ ఎక్కేందుకు నిరాకరించారు.