‘భారత వైమానిక దళం’పై సినీ ప్రముఖుల ప్రశంసలు

‘భారత వైమానిక దళం’పై సినీ ప్రముఖుల ప్రశంసలు

పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై  భారత వైమానిక దళం విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 300మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళ సైనికులపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత వైమానిక దళాన్ని చూస్తుంటే గర్వంగా ఉందంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. వారిలో రాజమౌళి, కమల్ హాసన్, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 26, 2019 | 12:36 PM

పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై  భారత వైమానిక దళం విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 300మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళ సైనికులపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత వైమానిక దళాన్ని చూస్తుంటే గర్వంగా ఉందంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. వారిలో రాజమౌళి, కమల్ హాసన్, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు సురేందర్ రెడ్డి, సౌందర్య రజనీకాంత్, సాయి ధరమ్ తేజ్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, అనుపమ, సిద్ధార్థ్, వరుణ్ తేజ్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, వెంకీ అట్లూరీ, నితిన్, అల్లు శిరీశ్, లావణ్య త్రిపాఠి, బ్రహ్మాజీ, విష్ణు విశాల్, విశాల్ తదితరులు ఉన్నారు.

కాగా భారత సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఈ నెల 14న జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి జరిపారు. అందులో 44మంది జవాన్లు మరణించారు. దీంతో దేశం మొత్తం అట్టుడికింది. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళాలతో మంగళవారం తెల్లవారుజామున 3.30గం. ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారత ప్రభుత్వం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu