రేపు సీబీఎస్‌ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల..

సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు (జులై 15) విడుదల కాబోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అధికారికంగా ప్రకటించారు. సీబీఎస్‌ఈ టెన్త్ క్లాస్ ఫలితాలను..

రేపు సీబీఎస్‌ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల..

Edited By:

Updated on: Jul 14, 2020 | 1:59 PM

సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు (జులై 15) విడుదల కాబోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అధికారికంగా ప్రకటించారు. సీబీఎస్‌ఈ టెన్త్ క్లాస్ ఫలితాలను results.nic.in, cbseresults.nic.in, cbse.nic.in వెబ్ సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. కాగా సోమవారమే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో 10వ తరగతి ఫలితాలపై ఉత్కంఠ నెలకొనగా.. ఒక్క రోజు గ్యాప్‌తోనే సీబీఎస్‌ఈ 10వ తరగతి రిజల్ట్స్ విడుదల కాబోతున్నాయి. ఈ ఏడాది 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. కాగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా CBSE 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలను మధ్యలోనే రద్దు చేసింది. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించింది సీబీఎస్ఈ.