అన్యమతస్థుల తిరుమల డిక్లరేషన్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి గుడిలోకి ప్రవేశించే అన్యమతస్థుల డిక్లరేషన్ పై ఏపీ మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ గుడికి, మసీదుకి, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని కొడాలి ప్రశ్నించారు. చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు? ప్రభువును నమ్ముతావా? అని సంతకం అడగలేదని ఆయన చెప్పుకొచ్చారు. డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమేనన్న ఆయన.. ఆ విధానం తీసేయాలన్నారు. సీఎం హోదాలో వెళ్లే ముఖ్యమంత్రిని డిక్లరేషన్ అడిగే హక్కు లేదన్నారు. ఎక్కడాలేని సంప్రదాయం […]

అన్యమతస్థుల తిరుమల డిక్లరేషన్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Updated on: Sep 20, 2020 | 6:33 PM

తిరుమల శ్రీవారి గుడిలోకి ప్రవేశించే అన్యమతస్థుల డిక్లరేషన్ పై ఏపీ మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ గుడికి, మసీదుకి, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని కొడాలి ప్రశ్నించారు. చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు? ప్రభువును నమ్ముతావా? అని సంతకం అడగలేదని ఆయన చెప్పుకొచ్చారు. డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమేనన్న ఆయన.. ఆ విధానం తీసేయాలన్నారు. సీఎం హోదాలో వెళ్లే ముఖ్యమంత్రిని డిక్లరేషన్ అడిగే హక్కు లేదన్నారు. ఎక్కడాలేని సంప్రదాయం తిరుమలలో మాత్రం ఎందుకు.! దాన్ని తీసేయాలంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు. జగన్ సర్కారు వచ్చినందునే ఇప్పుడు టెస్ట్ చెయ్యాలి….బ్లడ్ తీయాలి అంటున్నారన్న ఆయన.. జగన్ ప్రతిపక్ష నేతగా తిరుమల వెళ్ళినప్పుడు చంద్రబాబు ఎందుకు అడగలేదని నిలదీశారు. చంద్రబాబు నిష్టదరిద్రుడు.. ముసలి నక్క….!.. జగన్ ని చూసి చంద్రబాబు కుళ్లికుళ్ళి ఏడుస్తున్నాడు. అంటూ మళ్లీ విజయవాడలో తిట్ల దండకం అందుకున్నారు కొడాలి నాని.

Loading...
Unable to load recommendations.
Follow Us