ఏపీలో కొత్త అంబులెన్స్‌లు.. ప్రారంభించనున్న సీఎం జగన్

ఏపీలో వైద్యసేవలందక ఏ ఒక్కరు చనిపోకూడదన్న సదుద్దేశంతో దివంగతనేత, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమం 108, 104 సేవలు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా భ్రష్టుపట్టిపోయిన ఈ సేవలను మరింత మెరుగుపరిచి… వాటికి పూర్వవైభవం తెచ్చే మహత్తరమైన కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం విషయంలో మరో సువర్ణ అధ్యాయానికి ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకారం చుట్టారు. గత కొన్నేళ్లుగా ప్రజలకు పూర్తిగా అందుబాటులో మొబైల్ వైద్యసేవలు … ఇకపై […]

ఏపీలో కొత్త అంబులెన్స్‌లు.. ప్రారంభించనున్న సీఎం జగన్
Follow us

|

Updated on: Jul 01, 2020 | 10:08 AM

ఏపీలో వైద్యసేవలందక ఏ ఒక్కరు చనిపోకూడదన్న సదుద్దేశంతో దివంగతనేత, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమం 108, 104 సేవలు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా భ్రష్టుపట్టిపోయిన ఈ సేవలను మరింత మెరుగుపరిచి… వాటికి పూర్వవైభవం తెచ్చే మహత్తరమైన కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం విషయంలో మరో సువర్ణ అధ్యాయానికి ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకారం చుట్టారు. గత కొన్నేళ్లుగా ప్రజలకు పూర్తిగా అందుబాటులో మొబైల్ వైద్యసేవలు … ఇకపై ప్రతి గ్రామానికి చేరాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే 200 కోట్లకుపైగా ఖర్చు చేసి వెయ్యికి పైగా కొత్త 108, 104 వాహనాలను సిద్ధం చేశారు. వీటిని జులై 1వతేదిన విజయవాడ బెంజి సర్కిల్‌ నుండి ఆయనే స్వయంగా ప్రారంభించనున్నారు.

108 , 104 సర్వీసుల కోసం మొత్తం 1088 వాహనాల్ని సిద్ధం చేసింది ఏపీ సర్కార్. ఇందులో 676వాహనాల్ని 104 సేవలకు, మరో 412 వాహనాలను 108 సర్వీసులుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో కూడా 282 వెహికల్స్‌ని బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలుగా, 104 వెహికల్స్‌ని అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ యూనిట్‌గా సిద్ధం చేశారు. వీటితో పాటు 26 నియోనిటల్ అంబులెన్స్‌గా రూపొందించారు.

26 వాహనాలను నియోనిటల్ వెహికల్స్‌గా మార్చారు. ఇవి చిన్నపిల్లలు, గర్భిణులకు వైద్యసేవలందించనున్నాయి. ఇది ఓ మినీ ఐసీయుని పోలినట్లుగా డిజైన్ చేశారు. ఒక్కో జిల్లాకు రెండు నియోనిటల్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక అంబులెన్స్ లకు నిర్దిష్ట కాలపరిమితిలో చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటిని ఎక్కువగా కాన్పులు జరిగే ఆసుపత్రి వద్ద ఉంచాలని నిర్ణయించారు.

676 నూతన 104 వాహనాల్ని ప్రభుత్వం మొబైల్ క్లినిక్‌లుగా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక్కో వాహనం అందుబాటులో ఉంటుంది. రోజుకు ఒక గ్రామానికి ప్రజలకు వైద్య సేవలందిస్తుంది. డాక్టర్‌తో పాటు ఇద్దరు సహాయకులుంటారు. 9 రకాల రక్త పరీక్షలు, 20 రకాల వైద్య సేవలు చేస్తారు. రోగుల కోసం 74 రకాల మందులు ఈ104 వెహికల్స్‌ ఉంటాయి.

Latest Articles
ఓర చూపు.. దోర వలపు..! కుర్రాళ్ళ గుండెలు కొల్లగొడుతున్న పూజిత
ఓర చూపు.. దోర వలపు..! కుర్రాళ్ళ గుండెలు కొల్లగొడుతున్న పూజిత
హోంమంత్రిపైనే దాడా..? నిరసనకు దిగిన వైసీపీ శ్రేణులు
హోంమంత్రిపైనే దాడా..? నిరసనకు దిగిన వైసీపీ శ్రేణులు
22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు..
'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు..
సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?
సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?
సన్‌రైజర్స్ vs లక్నో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి..?
సన్‌రైజర్స్ vs లక్నో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి..?
వాటిని గమనించే ప్రజలు తీర్పు ఇస్తారు.. విపక్ష కూటమిపై అవంతి ఫైర్
వాటిని గమనించే ప్రజలు తీర్పు ఇస్తారు.. విపక్ష కూటమిపై అవంతి ఫైర్
ఈ సమ్మర్‌లో ఈ గింజలు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..
ఈ సమ్మర్‌లో ఈ గింజలు తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..
కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. కోమటి రెడ్డి లెక్క ఇదే..
కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్నంటే.. కోమటి రెడ్డి లెక్క ఇదే..
డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. చెక్ పెట్టాలంటే..
డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. చెక్ పెట్టాలంటే..