Coronavirus: తగ్గని కరోనా లక్షణాలు.. ఆసుపత్రికి బ్రిటన్ ప్రధాని

కరోనా వైరస్‌ బారిన పడిన బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను ఆసుపత్రికి తరలించారు. గత ఏడు రోజులుగా ఆయన క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నప్పటికీ..

Coronavirus: తగ్గని కరోనా లక్షణాలు.. ఆసుపత్రికి బ్రిటన్ ప్రధాని
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 9:01 AM

కరోనా వైరస్‌ బారిన పడిన బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను ఆసుపత్రికి తరలించారు. గత ఏడు రోజులుగా ఆయన క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని వైరస్‌ లక్షణాలు ఉండటంతో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఓ అధికారి ప్రతినిధి తెలిపారు. బోరిస్‌ వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై ఓ వీడియోలో వెల్లడించారు బోరిస్. “నా ఆరోగ్యం కాస్త మెరుగ్గానే ఉంది. నా ఏడు రోజుల కార్వంటైన్‌ కూడా పూర్తైంది. ఇంకా నాలో స్వల్పంగా వైరస్‌ లక్షణాలు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ నింబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలిగిపోయే వరకు నేను క్వారంటైన్‌లో ఉంటాను” అని ఆయన అన్నారు. కాగా గత వారం ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. బ్రిటన్ ప్రధానితో పాటు ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్స్‌ చార్లెస్‌కు కూడా కరోనా సోకింది. వీరందరూ ప్రస్తుతం స్వీయ నిర్భంధంలో ఉన్నారు.

Read This Story Also: ‘కరోనా’పై లఘుచిత్రం.. భాగమైన బిగ్‌ బీ, చిరు రజనీ..!