Breaking News
  • నల్గొండను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. ప్రజలు మనపై పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి-జగదీష్‌రెడ్డి. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం వేలకోట్ల నిధులు ఇస్తోంది. తొలిసారిగా ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తున్నాం. నల్గొండ అభివృద్ధికి కొత్త పాలకవర్గం చిత్తశుద్ధితో పనిచేయాలి. అభివృద్ధిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పాత్ర కీలకం-మంత్రి జగదీష్‌రెడ్డి.
  • ఢిల్లీ అల్లర్ల ప్రాంతంలో ఇంటెలిజెన్స్‌ అధికారి మృతదేహం లభ్యం. ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ అంకిత్‌శర్మగా గుర్తింపు.
  • ఢిల్లీలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ. ఢిల్లీ ట్రాఫిక్‌ ఏసీపీగా ఎస్డీ మిశ్రా. ఢిల్లీ క్రైమ్‌ ఏసీపీగా ఎం.ఎస్‌.రాంధవా. రోహిణి డీసీపీగా ప్రమోద్‌ మిశ్రా. ఢిల్లీ సెంట్రల్‌ డీసీపీగా ఎస్‌.భాటియా. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ డీసీపీగా రాజీవ్‌ రంజన్‌ బదిలీ.
  • ప.గో: చింతలపూడి జెడ్పీ పాఠశాలలో లైంగిక వేధింపులు. మహిళా టీచర్‌ను లైంగికంగా వేధిస్తున్న తోటి టీచర్‌. డీఈవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్‌.
  • తిరుపతి: పలమనేరు అటవీప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల కేసు. 8 మందిపై కేసునమోదు, ఇప్పటికే పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు ఏర్పాటు. కీలక నిందితుడు చెన్నైకి చెందిన స్వామీ జయచంద్రన్‌ కోసం గాలింపు. రుయాలో చికిత్సపొందుతున్న బాధితుడు గణేష్‌ పరిస్థితి విషమం. కాలిన గాయాలతో ఈ నెల 12న ఆస్పత్రిలో చేరిన గణేష్‌. గణేష్‌ను నరబలి ఇచ్చేందుకు యత్నించారంటున్న కుటుంబసభ్యులు. విద్యుత్‌షాక్‌తో గణేష్‌ ప్రమాదానికి గురయ్యాడంటున్న పోలీసులు.

ఎన్నికల ఖర్చు 60వేల కోట్లు… అందులో బీజేపీది 45 శాతం

BJP, ఎన్నికల ఖర్చు 60వేల కోట్లు… అందులో బీజేపీది 45 శాతం

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో అన్ని దేశాల కంటే అత్యంత ఖరీదైనది. ఈ మధ్య ముగిసిన ఎన్నికల్లో పెట్టిన ఖర్చే దీనికి ఉదాహరణ అంటోంది ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) అనే సంస్థ . ఈ సంస్థ వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈమధ్య ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ 60వేల కోట్లు (8.7బిలియన్‌ డాలర్లు) 2014 సార్వత్రిక ఎన్నికలకు ఇది రెట్టింపు. ‘ఈ 60వేల కోట్లలో 15-20 శాతం ఎలక్షన్‌ కమిషన్‌ చేసిన వ్యయమే. సగటున ఒక్కో నియోజకవర్గంలో రూ 100 కోట్ల మేర ఖర్చు జరిగింది. సగటున ఒక్కో ఓటరుపై పెట్టిన ఖర్చు రూ 700. ఎన్నికల నిర్వహణ, పార్టీలు ప్రచారం నిమిత్తం చేసిన వ్యయం, ఇతరత్రా ప్రలోభాలూ… వీటన్నింటినీ లెక్కవేస్తే ఇంత మొత్తం తేలింది’’ అని సీఎంఎస్‌ ఓ నివేదికలో తెలిపింది.

ఈ ఎన్నికల కోసం అధికార బీజేపీ పార్టీ ఏకంగా రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దేశం మొత్తం జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం అయిన ఖర్చులో బీజేపీ మాత్రమే 45 శాతం ఖర్చు చేసిందని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ… మన దేశంలో ఎన్నికలంటే పూర్తీగా డబ్బుతో ముడిపడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలూ చేసే ఖర్చుకి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలకు వచ్చే నిధులపై పారదర్శకత ఉండాలని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత్‌లోని రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్‌ బాండ్ల రూపంలో కార్పొరేట్లు, విదేశాల నుంచి నిధులు అక్రమంగా అందుతున్నాయని అన్నారు.

Related Tags