Bigg Boss 4: గంగవ్వ అభ్యర్థన.. డైలమాలో అభిమానులు

| Edited By:

Sep 18, 2020 | 12:50 PM

మొదటి వారం కాస్త సోసోగానే ఉన్నప్పటికీ.. రెండోవారం బిగ్‌బాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పెరిగింది. మోనాల్‌-అభిజిత్‌-అఖిల్ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ

Bigg Boss 4: గంగవ్వ అభ్యర్థన.. డైలమాలో అభిమానులు
Follow us on

Bigg Boss 4 Gangavva: మొదటి వారం కాస్త సోసోగానే ఉన్నప్పటికీ.. రెండోవారం బిగ్‌బాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పెరిగింది. మోనాల్‌-అభిజిత్‌-అఖిల్ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. హారికా, దివి అందాలు.. గంగవ్వ మాటలు షోకు ప్రధాన ఆకర్షణగా మారాయి.  అంతేకాదు షో ప్రారంభం అయి రెండు వారాలు కూడా అవ్వకముందే ఇద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీతో లోపలికి పంపారు. దీంతో వీక్షకుల్లో ఆసక్తి కూడా రోజురోజుకు పెరిగింది.

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉన్న వారిలో గంగవ్వ ఒకరు. ఈ షో ప్రారంభమైన రోజు కంటెస్టెంట్‌లకు పోల్ పెట్టగా.. అందులో అధిక ఓట్లతో గంగవ్వ టాప్‌గా నిలిచారు. అంతేనా గంగవ్వ పేరుతో బయట అభిమానులు ఆర్మీని స్టార్ట్ చేశారు. ఈ సీజన్‌లో ఆమెను ఎలాగైనా గెలిపించాలన్న కృత నిశ్చయంతో వారు ఉన్నారు. అయితే ఇప్పుడు వారందరూ డైలమాలో ఉన్నారు. మొదటి వారం స్ట్రాంగ్‌గానే ఉన్నప్పటికీ, రెండో వారం ప్రారంభం అయినప్పటి నుంచి గంగవ్వ కాస్త ముభావంగా ఉన్నారు. ఊరిని మిస్ అవుతున్నట్లు ఆమె మొహంలో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో గ‌త కొద్దిరోజులుగా తనను బయటకు పంపాలంటూ వేడుకుంటున్న‌ గంగ‌వ్వ అనారోగ్యం బారిన ప‌డింది.

దీంతో బిగ్‌బాస్ ఆమెను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి, ఆరోగ్యం ఎలా ఉంద‌ని అడిగాడు. అయితే ఇక్కడ అంద‌రూ బాగానే చూసుకుంటున్నారని, కానీ భ‌ర్త కొట్టిన దెబ్బ‌లు ఇప్పుడు మ‌ళ్లీ  నొప్పెడుతున్నాయ‌ని, తనకిక్క‌డ వాతావార‌ణం, ఆహారం ప‌డ‌టం లేదని ఏడ్చేసింది. మ‌ట్టిలో స్వేచ్చగా తిరిగేదాన్ని, ఇక్క‌డ ఉండ‌లేక‌పోతున్నాన‌ంటూ చెప్పింది. రెండు నెల‌లు ఉందామ‌నుకున్నా, కానీ త‌న వ‌ల్ల కావ‌ట్లేదంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. అయితే మీరు గ‌ట్టిమ‌నిషిని, ఇలాంటి ఎన్నో క‌ష్టాలను చూసి ఇక్క‌డిదాకా వ‌చ్చారని బిగ్‌బాస్ ధైర్యం నూరిపోశారు.

అయినా తాను ఉండలేనంటూ గంగవ్వ చెప్పింది. ఇక ఆమెను మెడిక‌ల్ రూమ్‌కు వెళ్ల‌మ‌ని చెప్పిన బిగ్‌బాస్‌ అక్క‌డ వైద్యుల‌తో చికిత్స అందించారు. అయితే బయటకు వచ్చిన తరువాత కూడా ఆమె కాస్త డల్‌గానే కనిపించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు. ఇంతవరకు ఎలాగైనా ఆమెను బిగ్‌బాస్ విన్నర్‌ని చేయాలనుకొని వారు ఉండగా.. గంగవ్వ డీలా పడటంతో వారు ఆలోచనలో పడ్డారు. ఆమెను బయటకు రప్పించడమే మంచిదన్న ఆలోచనలో ఇప్పుడు వారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి సీజన్‌లోనూ హీరో సంపు ఇలానే ఇంటి దిగులు పట్టుకొని హౌజ్‌ నుంచి తప్పించుకొని వచ్చిన విషయం తెలిసిందే.

Read More:

సుశాంత్ మైనపు బొమ్మ తయారీ.. కీలక వ్యాఖ్యలు చేసిన కళాకారుడు

‘ఛలో అంతర్వేది’కి అనుమతుల్లేవు: డీఐజీ