Bigg Boss 4: గంగవ్వకు కరోనా పరీక్ష..!

బుల్లితెరపై విజయవంతంగా కొనసాగుతున్న బిగ్‌బాస్‌ 4లో ఇప్పుడు కరోనా కలకలం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ షో కోసం పనిచేస్తున్న

Bigg Boss 4: గంగవ్వకు కరోనా పరీక్ష..!

Updated on: Sep 18, 2020 | 5:46 PM

Bigg Boss 4 Telugu: బుల్లితెరపై విజయవంతంగా కొనసాగుతున్న బిగ్‌బాస్‌ 4లో ఇప్పుడు కరోనా కలకలం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ షో కోసం పనిచేస్తున్న టెక్నీషియన్లకు కరోనా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బిగ్‌బాస్ టీమ్ అప్రమత్తమైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే తనకు బాలేదని, ఇంటికి పంపాలంటూ గంగవ్వ, బిగ్‌బాస్‌కి చెప్పింది. ఈ క్రమంలో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు టాక్. ఆమెతో పాటు హౌజ్‌లోని మిగిలిన వారికి సైతం కరోనా పరీక్షలు చేయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎవ్వరికీ ఎలాంటి లక్షణాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వారికి పరీక్షలు చేయించినట్లు టాక్. అయితే వారి ఫలితాలు ఇంకా రాలేదని సమాచారం.

కాగా బిగ్‌బాస్ ప్రారంభం అవ్వకముందే కంటెస్టెంట్‌లు అందరినీ నిర్వాహకులు క్వారంటైన్‌లో పెట్టారు. వారికి పరీక్షలు చేసి, నెగిటివ్ వచ్చిన తరువాతనే షోను ప్రారంభించారు. మరి ఇంతటి జాగ్రత్తలు తీసుకున్నా.. ఇప్పుడు ‘బిగ్‌బాస్’ టీమ్‌‌లో కరోనా కరోనా కలకలం రేపడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Read more:

ధైర్యమే బలం: కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు

కీర్తిని వద్దనుకుంటోన్న మహేష్‌ టీమ్‌.. కారణమిదేనా..!

Loading...
Unable to load recommendations.
Follow Us