Bigg Boss 4: కరాటే కళ్యాణి ఔట్.. నెక్ట్స్‌ అతడే..!

బిగ్‌బాస్‌ వీకెండ్ షోను వ్యాఖ్యత నాగార్జున హౌస్‌ను షేక్ ఆడించారు. కంటెస్టెంట్‌ అందరికీ పెద్ద క్లాస్ పీకారు.

Bigg Boss 4: కరాటే కళ్యాణి ఔట్.. నెక్ట్స్‌ అతడే..!

Updated on: Sep 20, 2020 | 7:14 AM

Bigg Boss 4 Karate Kalyani: బిగ్‌బాస్‌ వీకెండ్ షోను వ్యాఖ్యత నాగార్జున హౌస్‌ను షేక్ ఆడించారు. కంటెస్టెంట్‌ అందరికీ పెద్ద క్లాస్ పీకారు. ఈరేంజ్‌లో నాగ్‌ ఫైర్ అవ్వడం ఇదే తొలిసారి కావొచ్చు. ఈ వారం సెల్ఫ్ నామినేట్ అయిన వాళ్లందరినీ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ ఆయనకడిగి పారేశారు. సేఫ్ గేమ్ ఆడాలంటే తాను జరగనివ్వనని హెచ్చరించారు. ఇక ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్ ఉంటుందంటూ చెప్పిన నాగార్జున, మొదటగా కరాటే కళ్యాణిని బయటకు పంపారు.

ఈ వారం నామినేషన్‌లో మొత్తం తొమ్మిది మంది ఉండగా.. వారిలో గంగవ్వను మొదట సేఫ్ చేశారు నాగార్జున. మిగిలిన ఎనిమిది మందిలో అమ్మరాజశేఖర్, కుమార్ సాయి, నోయల్, కరాటే కళ్యాణి, హారిక, అభిజిత్, మోనాల్, సొహైల్‌‌లలో కరాటే కళ్యాణి ఎలమినేట్ అయినట్టు వెల్లడించారు. ఇక రెండో ఎలిమినేషన్‌ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కుమార్ సాయి అని తెలుస్తోంది. హౌజ్‌లోకి వెళ్లేముందు నాగార్జున దగ్గర బీరాలు పలికిన సాయి కుమార్ లోపలికి వెళ్లిన తరువాత మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఇక నాగార్జున మాట్లాడుతుండగా, కుమార్ సాయి నవ్వుతుండటంపై ఆయన సీరియస్‌ అయ్యారు. నువ్వు ఎందుకయ్యా నవ్వుతున్నావ్.. బిగ్‌బాస్ అంటే జోక్‌గా ఉందా..? జోక్‌లు వేసుకునే మ్యాటర్ కాదు. నువ్వు లోపలికి వెళ్లి జోక్‌లు వేయడం లేదు. నవ్వడం దేనికి అంటూ క్లాస్ పీకారు. ఈ క్రమంలో సాయి కుమార్ ఈ వారం బయటకు వచ్చేస్తాడని తెలుస్తోంది.

Read More:

రాయుడు విజృంభణ,‌ చెన్నై బోణీ

తెలంగాణలో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Loading...
Unable to load recommendations.
Follow Us