స్వాతి ఫ్యాన్స్ ధర్నా.. బిగ్ బాస్‌లోకి మళ్లీ తీసుకోవాలంటూ.!

|

Oct 08, 2020 | 6:29 PM

స్వాతి దీక్షిత్ ఫ్యాన్స్ ఏంటి.! అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ధర్నా చేయడం ఏంటని అనుకుంటున్నారా.! నిజమండీ బాబు.. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన వారంలోపే..

స్వాతి ఫ్యాన్స్ ధర్నా.. బిగ్ బాస్‌లోకి మళ్లీ తీసుకోవాలంటూ.!
Follow us on

Bigg Boss 4: స్వాతి దీక్షిత్ ఫ్యాన్స్ ఏంటి.! అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ధర్నా చేయడం ఏంటని అనుకుంటున్నారా.! నిజమండీ బాబు.. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన వారంలోపే స్వాతి దీక్షిత్‌ను ఎలిమినేట్ చేయడంతో ఆమె అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర నిరసనకు దిగారు. గత వారం ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్.. మూడో వైల్డ్ కార్డు ఎంట్రీగా హౌస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హౌస్ మేట్స్ అందరిని కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న స్వాతికి సడన్‌గా షాక్ ఇస్తూ ఎలిమినేట్ చేశారు. ఇదే ఆమెకు షాక్ అయితే.. బయటికి వచ్చి ఒక్కో ఎపిసోడ్‌ చూసిన స్వాతికి మరో షాక్ తగిలింది.

హౌస్‌లో తాను బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు అన్నీ చేసినా.. వాటిల్లో 10 శాతం మాత్రమే బయట చూపించారని వాపోయింది. తమ అభిమాన నటిని కావాలనే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారని ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఆందోళన చేపట్టారు. స్వాతి దీక్షిత్‌ని ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదని.. ఆమెకు సరైన స్క్రీన్ స్పేస్ ఇవ్వకుండా కుట్ర చేశారని స్వాతి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఎలిమినేషన్స్ ప్రక్రియను చూస్తుంటే.. ప్రతి వారం ఎవరిని ఎలిమినేషన్ చేయాలన్నది బిగ్ బాస్ టీం ముందుగానే డెసిషన్ తీసేసుకుందని విమర్శిస్తున్నారు. ప్రేక్షకుల చేతుల్లోనే ఎలిమినేషన్ ఉందని నాగార్జున చెబుతున్నారని.. కానీ చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న స్వాతి దీక్షిత్‌ను కావాలనే బిగ్ బాస్ టీం పంపించేశారని చెప్పారు. స్వాతిది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని.. మళ్లీ ఆమెను తిరిగి హౌస్‌లోకి తీసుకురండి అంటూ స్వాతి ఫ్యాన్స్ ప్లకార్డులను ప్రదర్శించారు.

Also Read: 

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

యువ నటుడికి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..